True Love: నిజ‌మైన ప్రేమ అంటే ఇదేనేమో.. ఆద‌ర్శంగా నిలిచిన దంప‌తులు

True Love: ఈ కాలంలో ప్రేమ ఎప్పుడు పుడుతుందో, పెళ్లి ఎప్పుడు పెటాకులు అవుతుందో ఎవరు చెప్ప‌లేం. చిన్న చిన్న మాట‌ల‌కు, మన‌స్ప‌ర్థ‌ల‌కు వివాహ బంధాలు విడాకుల వ‌ర‌కు వెళుతున్నాయి. అయితే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైన‌, ఎలాంటి క‌ష్టాలు వ‌చ్చినా కూడా బంధాన్ని నిలుపుకునే వాళ్లు లేక‌పోలేదు. మ‌హ్మ‌ద్ ఉమ‌ర్ దంప‌తులు ఈ కోవ‌కు చెందిన వారే. ఈ జంట ఎంద‌రికో ఆద‌ర్శంగా నిలుస్తార‌న‌డంలో అతి శ‌యోక్తి లేదు.

True Love

బబుల్ మ్యాన్ మ‌హ్మ‌ద్ ఉమ‌ర్‌.. ఈయ‌న‌ని చూస్తే ఆమ‌డ‌దూరం వెళ్ల‌డం ఖాయం. భ‌యంక‌ర‌మైన చ‌ర్మ‌వాధితో కొన్నేళ్లుగా బాధ‌ప‌డుతున్న ఉమ‌ర్‌ని 28 ఏళ్ల వ‌య‌స్సులో ప్రేమించింది ఫ‌ర్హ‌త్. అయితే తాను ప్రేమించే స‌మ‌యంలో ప్రియుడికి అప్పుడే చ‌ర్మ వ్యాధి మొద‌లైంది. ఈ వ్యాధి శ‌రీర‌మంతా పాకుతుంది. అత‌డిని చేసుకొని ఇబ్బంది ప‌డ‌తావు అని ఆమెకు కుటుంబ స‌భ్యులు న‌చ్చ‌జెప్పారు.

ఎవ‌రెన్ని చెప్పిన కూడా విన‌కుండా ఉమ‌ర్‌ని పెళ్లాడిన ఫ‌ర్హ‌త్ త‌న ప్రేమ నిజ‌మ‌ని నిరూపించింది. పెళ్లి త‌ర్వాత ఆయ‌న‌కు వ్యాధి మ‌రింత పెరిగింది. ఒంటి నిండా బ‌బుల్స్ వ‌చ్చాయి. చూడ‌డానికి భ‌యంక‌రంగా మారిపోయాడు ఉమ‌ర్.అయిన‌ప్ప‌టికీ అత‌నితో సంసారం చేసి ఇద్ద‌రు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది ఫ‌ర్హ‌త్. ఇప్పుడు ఉమ‌ర్ కు 62 సంవ‌త్స‌రాలు అదృష్టవ‌శాత్తు అత‌ని ఇద్ద‌రు కొడుకుల‌కు ఉమ‌ర్ వ్యాధి రాలేదు.

True Love

వ్యాధిని ఏ మాత్రం ప‌ట్టించుకోని కుటుంబ స‌భ్యులు ఉమ‌ర్‌తో చాలా అన్యోన్య‌యంగా ఉంటూ కాలం గడుపుతున్నారు. వీరి స్టోరీ చాలా ఆద‌ర్శం. ఈ జంట‌ని చూసైన ప్రేమికులు లేదంటే , భార్య భ‌ర్త‌లు చిన్న చిన్న కార‌ణాల‌కు త‌మ రిలేష‌న్‌ని నాశ‌నం చేసుకోవ‌డం మంచి కాద‌ని అంటున్నారు.