Madhya Pradesh : బీజేపీ నాయ‌కుడి వీరంగం.. పంచాయతీ కార్య‌దర్శిని చిత‌క్కొట్టిన వైనం

NQ Staff - August 4, 2022 / 09:45 AM IST

Madhya Pradesh : బీజేపీ నాయ‌కుడి వీరంగం.. పంచాయతీ కార్య‌దర్శిని చిత‌క్కొట్టిన వైనం

Madhya Pradesh : ఇటీవ‌ల రాజ‌కీయ నాయ‌కులు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌పై దాడులు చేస్తూ వారిని భ‌య‌బ్రాంతుల‌కి గురి చేస్తున్నారు. చిన్నా చిత‌కా కార‌ణాల‌కు కూడా వారిపై దాడులు చేస్తున్నారు. ఆ మ‌ధ్య పార్టీ జెండా దిమ్మె నిర్మాణానికి అనుమతులు ఇవ్వలేదంటూ పంచాయతీ కార్యదర్శిపై దాడికి తెగబడ్డారు. సాక్షాత్తూ గ్రామ సర్పంచ్, మరో ఎంపీటీసీ సభ్యురాలి భర్త పంచాయతీ కార్యదర్శిని కర్రలతో కొట్టి గాయపరచడం నల్గొండ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.

In Madhya Pradesh's Rewa, a BJP leader indiscriminately thrashed a panchayat secretary

In Madhya Pradesh’s Rewa, a BJP leader indiscriminately thrashed a panchayat secretary

ఇంత దారుణ‌మా?

కర్నూలు జిల్లా హాలహర్విలో కూడా వైకాపా నాయకుడు.. పంచాయతీ కార్యదర్శులపై దాడులకు తెగబడ్డాడు. నిట్రవట్టి గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు వివాహ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని అడగ్గా.. ఆధార్, వివాహ పత్రిక జత చేసి దరఖాస్తు చేయాలని పంచాయతీ కార్యదర్శి సూచించారు. దీంతో ఆగ్రహించిన వైకాపా నాయకుడు ఎంపీడీవో సమక్షంలోనే నోటికి వచ్చినట్లు తిడుతూ దాడి చేసినట్లు సిబ్బంది తెలిపారు.

ఇక తాజాగా మ‌ధ్య ప్ర‌దేశ్‌లోని రేవ‌లో ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది. ప్ర‌భుత్వ ఉద్యోగి అని కూడా చూడ‌కుండా పంచాయ‌తీ కార్య‌ద‌ర్శిని గొడ్డుని బాదిన‌ట్టు బాదాడు. విచ‌క్ష‌ణా ర‌హితంగా కొడుతున్నా కూడా అక్క‌డ వారెవ‌రు ఆపేందుకు ప్ర‌య‌త్నం చేయ‌లేదు. దారుణ‌మైన ఈ ఘ‌ట‌న‌ని ప్ర‌తి ఒక్క‌రు ఖండిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, ఆ బీజేపీ నాయ‌కుడికి క‌ఠిన శిక్ష విధించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Read Today's Latest National in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us