Ghulam Nabi Azad : కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ గుడ్ బై.!

NQ Staff - August 26, 2022 / 01:44 PM IST

Ghulam Nabi Azad : కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ గుడ్ బై.!

Ghulam Nabi Azad : ‘ఆంధ్రప్రదేశ్ అంటే అదేమీ కేక్ కాదు.. ఇష్టమొచ్చినట్లు కోసి పారెయ్యడానికి..’ అంటూ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ గుర్తున్నారా.? ఆయన కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితుడు. కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబేతర వ్యక్తి అధ్యక్షుడైతే, ఆ రేసులో గులాం నబీ ఆజాద్ పేరు ఖచ్చితంగా వుంటుంది.

కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన పదవుల్ని ఆయన నిర్వహించారు. పలు రాష్ట్రాలకు ఆయన ఇన్‌ఛార్జిగా కూడా ఆయన గతంలో పని చేశారు. ఇప్పుడాయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా తనకు సంక్రమించిన అన్ని పదవులకూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఆజాద్.

కాంగ్రెస్ పార్టీని వీడటం బాధగా వుంది: ఆజాద్

Ghulam Nabi Azad Broke Association with Congress Party

Ghulam Nabi Azad Broke Association with Congress Party

గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్ పార్టీతో 50 ఏళ్ళుగా తనకున్న బంధాన్ని తెంచుకున్నారు. ఇలా బంధాన్ని తెంచుకోవాల్సి రావడం చాలా బాధగా వుందని చెప్పారాయన. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి సుదీర్ఘంగా ఈ మేరకు లేఖ రాశారు ఆయన.

రాహుల్ గాంధీ వల్లన కాంగ్రెస్ పార్టీ నాశనమైందని ఆజాద్ అభిప్రాయపడుతున్నారు. పార్టీ విధి విధానాలు, అంతర్గత వ్యవహారాలపై ఆజాద్ గత కొంతకాలంగా అసంతృప్తితో వున్నారు. అదే సమయంలో ఆయన్ని భారతీయ జనతా పార్టీ ఇటీవలి కాలంలో పొగుడుతూ వస్తోంది.

కాగా, సీనియర్లను రాహుల్ గాంధీ అవమానించేలా వ్యవహరిస్తుండడం వల్లే ఆజాద్ కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చిందంటూ పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు అభిప్రాయపడుతుండడం గమనార్హం. ఆజాద్ బాటలో మరికొందరు సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీని వీడే అవకాశం వుంది.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us