Delta Plus: రెండు డోసుల టీకా తీసుకున్న మహిళ.. డెల్టా ప్లస్ వేరియెంట్‌తో ముంబైలో తొలి మరణం
Samsthi 2210 - August 17, 2021 / 03:11 PM IST

Delta Plus: కరోనా మహమమ్మారి బుసలు కొడుతూనే ఉంది. ఇప్పటికే రెండు వేరియెంట్‌లు ఎంతో మందిని పొట్టన పెట్టుకోగా,ఇప్పుడు మూడో వెరియెంట్ పడగ విప్పుతుంది. ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ డెల్టా వేరియెంట్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మనదేశంలోను డెల్టా కేసులు నమోదు అవుతుతున్నాయి. మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియెంట్ విజృంభించడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. డెల్టా ప్లస్‌తో ముంబైలో తొలి మరణం సంభవించింది.
ముంబైలో డెల్టా ప్లస్ వేరియెంట్ కరోనా వైరస్‌తో తొలి మరణం సంభవించిందని బృహత్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) వెల్లడించింది. 63 ఏళ్ల మహిళ చికిత్స పొందుతూ గతనెలలో మరణించిందని వారు వెల్లడించారు. మృతురాలికి జులై 21న కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, చికిత్స పొందుతూ జులై 27న ఆమె మరణించింది.
కేవలం 5 రోజుల్లోనే మరణించడంతో.. డాక్టర్లు శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ చేశారు. ఆమె డెల్టా ప్లస్ వేరియెంట్ వైరస్‌తో మరణించినట్లు గుర్తించారు. రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకండా పోయింది. మృతురాలి కుటుంబంలో మరో ఆరుగురు వ్యక్తులు కూడా కోవిడ్ బారినపడ్డారు. వారిలో ఇద్దరికి డెల్టా ప్లస్ వేరియెంట్ వైరస్ సోకిందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు.
మహిళ మృతితో మహారాష్ట్రలో ఇప్పటి వరకు రెండు డెల్టా ప్లస్ వేరియెంట్ మరణాలు సంభవించాయి.ఆ మధ్య 80 ఏళ్ల ఓ మహిళ కన్నుమూసింది. కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యల వల్ల ఆమె చనిపోయింది. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 65 డెల్టా ప్లస్ వేరియెంట్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 11 కేసులు ముంబైలోనే ఉన్నాయి. డెల్టా ప్లస్‌ను ఆందోళనకర వేరియెంట్‌గా గుర్తిస్తున్నట్లు కేంద్రం ఇది వరకే తెలిపింది. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలలోకి కూడా ఈ వేరియెంట్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి.