Team India: టీమిండియా ప్లేయ‌ర్‌కు క‌రోనా.. అల‌ర్ట్ అయిన బీసీసీఐ

Team India: కరోనా మ‌హ‌మ్మారి బుస‌లు కొడుతూనే ఉంది. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ ఈ మ‌హ‌మ్మారి త‌న ప్ర‌తాపం చూపిస్తూనే ఉంది. క్రికెట‌ర్స్ బ‌యోబుల్ వాతావ‌ర‌ణంలో ఉంటున్న‌ప్ప‌టికీ వారిపై కూడా క‌రోనా పంజా విసురుతుంది. ఈమధ్య పాకిస్థాన్‌లో సిరీస్‌ సందర్భంగా ఇంగ్లండ్‌ క్యాంప్‌లో కరోనా వైరస్‌ కలకలం చెలరేగిన విషయం తెలిసిందే. తాజాగా టీమిండియా క‌రోనా క‌ల‌క‌లం రేగింది.

Corona Positive to Team india Player
Corona Positive to Team india Player

డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ త‌ర్వాత 20 రోజుల బ్రేక్ దొర‌క‌డంతో ఈ గ్యాప్‌లో ప్లేయ‌ర్స్ యూకేలో సైట్ సీయింగ్‌కు వెళ్లారు. ఆ స‌మ‌యంలో ఒక‌రికి క‌రోనా ఎఫెక్ట్ అయింది. ప్ర‌స్తుతం ఇంగ్లండ్ ప‌ర్య‌న‌ట‌లో ఉన్న ఉన్న 23 మంది ఆటగాళ్ల బృందంలో ఒకరికి కరోనా సోకింది. ఆటగాడి పేరు బయటకు వెల్లడించకపోగా.. ప్రస్తుతం అతను తన బంధువుల ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

స‌ద‌రు క్రీడాకారుడికి స్వ‌ల్ప గొంతు నొప్పి రావ‌డంతో కరోనా ప‌రీక్ష‌లు చేయ‌గా, పాజిటివ్ అని తేలింద‌ట. ఆ ఆటగాడితో సన్నిహితంగా ఉన్న జట్టు సభ్యులను, సిబ్బందిని మూడురోజుల పాటు ఐసోలేషన్‌ వెళ్లమని వైద్య సిబ్బంది సూచించగా.. ఆ గడువు ముగిసింది. దీంతో గురువారం ఆ ఆటగాడు మినహా.. మిగతా వాళ్లంతా డర్హమ్‌కు బయలుదేరనున్నారు. ఆగష్టు 5వ తేదీ నుంచి టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడాల్సి ఉంది.

బుధవారం బీసీసీఐ ప్రెసిడెంట్‌ గంగూలీ, చీఫ్‌ సెలక్టర్‌ చేతన్‌ శర్మ కోల్‌కతాలో సమావేశంకాగా, ఏం చర్చించారనే విషయంపై గోప్యతను ప్రదర్శించారు. ఇంగ్లండ్‌లో ప్ర‌స్తుతం డెల్టా వేరియెంట్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో బీసీసీఐ సెక్రెటరీ జై షా అప్రమత్తంగా ఉండాలని మిగతా ఆటగాళ్లను ఉద్దేశించి ఓ మెయిల్‌ లేఖను పంపారు. ఆట‌గాడికి ఎలా క‌రోనా సోకింద‌నే దానిపై విచార‌ణ జ‌రుపుతున్నారు.

డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ తర్వాత టీమిండియా ఆటగాళ్లను బయటకు వెళ్లొద్దని బీసీసీఐ సూచించినప్పటికీ.. కొందరు ఏకంగా వింబుల్డన్‌ టోర్నీకి హాజరయ్యారు. ఆస‌మ‌యంలో సోకి ఉంటుంద‌ని భావిస్తున్నారు.