Coromandel Express : కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కి ప్రమాదం.. 50 మంది మృతి 300 మందికి గాయాలు
NQ Staff - June 2, 2023 / 10:51 PM IST

Coromandel Express : ఒడిస్సా లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న గూడ్స్ రైలుని కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఢీ కొట్టడంతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. ట్రాక్ పై పడిన కోరమాండల్ భోగిలను మరో ప్యాసింజర్ రైలు ఢీ కొట్టింది.
బాలేశ్వర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 50 మంది మృతి చెందగా 300 మంది గాయాల పాలయ్యారు. తొలుత కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదంతో 13 బోగీలు మరో ట్రాక్ పై పడ్డాయి.
ఆ తర్వాత కొద్ది సేపటికే పక్క ట్రాక్ పై వస్తున్న యశ్వంత్ పూర హౌరా ఎక్స్ప్రెస్ కోరమాండల్ భోగిలను ఢీ కొట్టడంతో ఆ రైలులో నాలుగు భోగీలు సైతం పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతుంది.
ఒడిస్సా రైలు ప్రమాదంలో మృతి చెందిన వారికి పది లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. గాయపడ్డ వారికి రెండు లక్షలు మరియు స్వల్ప గాయాలైన వారికి 50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియాని ప్రకటించారు.