Congress : నోరు జారాను.. క్షమించండి : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి కాంగ్రెస్ ఎంపీ లేఖ

NQ Staff - July 30, 2022 / 05:00 AM IST

Congress : నోరు జారాను.. క్షమించండి : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి కాంగ్రెస్ ఎంపీ లేఖ

Congress : పొరపాటున నోరు జారాననీ, ఉద్దేశ్యపూర్వకంగా ఎలాంటి తప్పూ చేయలేదనీ పేర్కొంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి లేఖ రాశారు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి. తన క్షమాపణల్ని అంగీకరించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ ఎంపీ.

Congress's Adhir Ranjan after referring to prez as Rashtrapatni

Congress’s Adhir Ranjan after referring to prez as Rashtrapatni

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఉద్దేశించి ‘రాష్ట్రపత్ని’గా అభివర్ణించి వివాదాల్లోకి ఎక్కారు అధిర్ రంజన్ చౌదరి. పొరపాటున అలా తన నోట ‘రాష్ట్రపత్ని’ అన్న ప్రస్తావన వచ్చిందంటూ ఎంతలా తన వాదనను వినిపించే ప్రయత్నం అధిర్ రంజన్ చౌదరి చేస్తున్నా, ఈ విషయమై బీజేపీ తనదైన రాజ్యాంగాన్ని చట్ట సభల్లోనూ, బయటా, మీడియా చర్చల్లోనూ కొనసాగిస్తూనే వుంది.

క్షమాపణ చెప్పేందుకు అవకాశం కోరినా.. ప్రయోజనం లేకపాయె..

చట్ట సభల సాక్షిగా తాను క్షమాపణ చెబుతానంటూ అధిర్ రంజన్ చౌదరి ఇప్పటికే ప్రకటించినా, అందుకు ఆయనకు అవకాశం దొరకడంలేదు. అధిర్ రంజన్ చౌదరి కాదు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోన్న విషయం విదితమే.

కాగా, సోనియా గాంధీ కూడా ఈ వివాదంపై స్పందించారు. అధిర్ రంజణ్ చౌదరి క్షమాపణ చెబుతానన్నాక ఈ విషయాన్ని వివాదం చేయడంలో అర్థం లేదని ఆమె అన్నారు.

ఇక, ఎంపీ అధిర్ రంజన్ చౌదరి లేఖ రాసిన దరిమిలా, ఆ లేఖపై రాష్ట్రపతి స్పందిస్తారా.? స్పందిస్తే వివాదానికి ముగింపు పడుతుందా.? వేచి చూడాల్సిందే.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us