Surgeon: 7 గంటల్లో 101 మంది మ‌హిళ‌ల‌కు ఆప‌రేష‌న్.. ఇది సాధ్య‌మేనా?

Surgeon: ఇది అత్యుత్సాహం అనాలా లేదంటే డ‌బ్బుపై మోజు అనాలో తెలియ‌దు కాని ఛ‌త్తీస్‌ఘ‌డ్‌లోని స‌ర్గుజా జిల్లాలో ఓ వైద్యుడు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించాడు. ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో 101 మంది మ‌హిళ‌ల‌కు కేవ‌లం ఏడు గంట‌ల‌లో కుటుంబ నియంత్ర‌ణ శ‌స్త్ర చికిత్స‌లు చేశారు. దీంతో ప్ర‌భుత్వం వెంట‌నే విచార‌ణ‌కు ఆదేశించింది.

Chhattisgarh Orders Probe After Surgeon Operates On 101 Women In 7 Hours
Chhattisgarh Orders Probe After Surgeon Operates On 101 Women In 7 Hours

ఆగ‌స్ట్ 27న జిల్లాలోని మెయిన్‌ప‌ట్ డెవ‌లప్‌మెంట్ బ్లాక్‌లో గ‌ల న‌ర్మ‌దాపూర్ క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్‌లో స్టిరిలైజేష‌న్ క్యాంప్ ఏర్పాటుచేశారు.ఆ క్యాంప్‌లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయాని స్థానిక మీడియాలో వార్త‌లు రాగా, ఇందులో విధులు నిర్వ‌హించిన డాక్ట‌ర్ కేవ‌లం 7 గంట‌ల‌లో101 మంది మ‌హిళ‌ల‌కు కుటుంబ నియంత్ర‌ణ శ‌స్త్ర చికిత్స‌లు చేశారు.

సాధార‌ణఃగా స‌ర్జ‌న్ ఒక రోజులో 30 ఆప‌రేష‌న్స్ మాత్ర‌మే చేయాలి. అత‌ను అన్ని చేసాడు అనే స‌రికి రాష్ట్ర ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించింది మ‌ధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 7 గంటల ప్రాంతంలో స‌ర్జ‌న్ ఆప‌రేష‌న్ చేసిన‌ట్టు తెలిసింది. క‌మిటి నివేదిక వ‌చ్చాక త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అధికారులు తెలిపారు. అయితే ఆప‌రేష‌న్ చేయించుకున్న వారంద‌రు ప్ర‌స్తుతం ఆరోగ్యంగానే ఉన్న‌ట్టు తెలుస్తుంది.