Central Minister: కేంద్ర‌మంత్రి త‌ల్లిదండ్రులు ఇంకా పొలం ప‌నులే చేస్తున్నారా…!

Central Minister: త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌లని ఉన్న‌త స్థాయిలో చూడాల‌ని ఎన్నో క‌లలు కంటారు. బిడ్డ‌లు మంచి పొజీష‌న్‌లో ఉంటే మ‌నం ప్ర‌శాంతంగా విశ్రాంతి తీసుకొని ఇంటి ప‌ట్టునే ఉండొచ్చ‌నేది కొంద‌రు పేరేంట్స్ భావ‌న‌. అయితే త‌మ కొడుకుని కేంద్ర‌మంత్రిని చేసిన త‌ల్లిదండ్రులు విశ్రాంతి తీసుకోకుండా ఇంకా పొలం ప‌నుల‌కే వెళుతున్నారు.దిన‌స‌రి కూలీలుగానే కాలం గ‌డుపుతున్నారు. ఇది విన‌డానికి కాస్త ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్న‌ప్ప‌టికీ ముమ్మాటికి నిజం

Central Minister L Murugan Parents Farming
Central Minister L Murugan Parents Farming

ఇటీవలే క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణ సమయంలో తమిళనాడుకు చెందిన డాక్టర్ ఎల్ మురుగన్ కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు పొందారు. అయితే ఇలా కొడుకు కేంద్ర మంత్రి పదవి దక్కినప్పటికీ ఆయన తల్లిదండ్రులు మాత్రం ఇంకా సొంత ఊరు లోని ఒక భూస్వామి పొలంలో కూలిలుగా పని చేసుకుంటూ ఉండటం గమనార్హం.

కుమరుడు కేంద్ర‌మంత్రి అయిన ఆయ‌న త‌ల్లిదండ్రులు స్వ‌గ్రామం న‌మ్మ‌క‌ల్ జిల్లాలోని కోనూరులోనే ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కొడుకు సంపాదన‌తో కాకుండా కూలీ నాలి చేసి వ‌చ్చిన దాంట్లో తింటే ఆ సంతోషం వేరుగా ఉంటుంద‌ని వారు భావిస్తున్నారు. వీరి అంశం ఇటీవ‌ల మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కుమారుడు కేంద్ర మంత్రి క‌దా, మీరు పొలం ప‌నులు ఇంకా చేస్తున్నారెందుకు అని మీడియా వారిని ప్ర‌శ్నించింది.

దీనికి స‌మాధానం ఇచ్చిన పేరెంట్స్ మా కుమారుడు కేంద్ర మంత్రి అయితే మేమేం చేయాలి అంటూ ఆ తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ కుమారుడు కేంద్ర మంత్రి కావడం గర్వంగా ఉంది కానీ అతని ఎదుగుదలకు తాము చేసింది ఏమీ లేదు అంటూ ఆ తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఇక ఓ రోజు పొలంలో కూలి పని చేసుకుంటుంటే తన కొడుకుకి కేంద్ర మంత్రి పదవి వచ్చింది అన్న విషయం తెలిసింది అంటూ తల్లిదండ్రులు చెబుతున్నారు.

త‌న కొడుకు కేంద్ర మంత్రి అయిన వారిలో ఎలాంటి మార్పు రాలేదని భూస్వామి అంటున్నారు.ఇంత‌క‌ముందు లానే పొలంలో కూలి ప‌నులకు వెళుతున్నారు. ఇక రేషన్ దుకాణాల వద్ద సామాన్యుల మాదిరిగానే వరుసలో నిలబడి సరుకులు తీసుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇలా కొడుకు కేంద్ర మంత్రి అయినప్పటికీ తల్లిదండ్రులు మాత్రం తమ కష్టం మీదనే ఇంకా బ్రతకాలని వృద్ధాప్యంలో కూడా అనుకోవడం ఎంతో గొప్ప విషయం అని అంటున్నారు స్థానికులు.

ఎల్​.మురుగన్​ తల్లిదండ్రులు ​వరుదమ్మల్, లోకనాథన్​ది తమిళనాడు నమక్కల్​ జిల్లా కొన్నూర్​ గ్రామం. ​అరుంధతియార్​ అనే దళిత సామాజికవర్గానికి చెందిన వీరు.. తమ ఊరిలోనే ఓ చిన్న ఇంట్లో నివసిస్తూ ఉంటారు. తమ కుమారుడు ఎల్​.మురుగన్​ తమిళనాడు భాజపా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా.. వీళ్లు వ్యయసాయ కూలీ పనులకు వెళ్తూనే జీవించేవారు.

డాక్టర్ అంబేడ్కర్ న్యాయ కళాశాల నుంచి న్యాయవిద్యను అభ్యసించిన ఎల్​.మురుగన్​.. కొన్నాళ్లపాటు లాయర్​గా పనిచేశారు. అనంతరం ఆయన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్​, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్​(ఆర్​ఎస్​ఎస్​)లో చేరారు. న్యాయవాదిగా ఆయన భాజపా తరఫున ఎన్నో కేసులను వాదించారు.