Assembly Elections : నియోజకవర్గం పేరు థౌజెండ్ లైట్స్.. ఎన్నికల ప్రచారంలో అంతకన్నా హైలైట్స్..

Assembly Elections : తమిళనాడులో ప్రస్తుతం శాసన సభ ఎన్నికలు జరుగుతున్నాయి కదా. ఆ రాష్ట్ర రాజధాని చెన్నై పరిధిలో ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. దాని పేరు థౌజెండ్ లైట్స్. అంటే ‘‘వెయ్యి దీపాలు’’ అని అర్థం. ఆ సెగ్మెంట్ పేరు ఎంత ఆసక్తికరంగా, వెరైటీగా ఉందో అక్కడ నడుస్తున్న ఎలక్షన్ ప్రచారం కూడా అంతే ఆకట్టుకునేలా ఉంది. అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడ సీనియర్ సినీ నటి ఖుష్బూ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. వీటన్నింటికీ మించి మరో హైలైట్ అంశం ఒకటుంది. ఆమె ఇటీవల తన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ అందర్నీ నవ్వించారు. తానూ నవ్వుల పాలయ్యారు.

మూడో పార్టీలో.. మూడ్ మారలేదు..

హీరో విక్టరీ వెంకటేష్ తో కలియుగ పాండవులు, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ తో పేకాట పాపారావు తదితర తెలుగు హిట్ చిత్రాల్లో నటించిన ఖుష్బూ రీసెంటుగా 2018లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అజ్ఞాతవాసిలో కూడా మెరిశారు. దాదాపు పదకొండేళ్ల కిందట రాజకీయాల్లోకి ఎంటరయ్యారు. 2010లో తమిళనాడులో కరుణానిధి పార్టీ డీఎంకేలో చేరారు. నాలుగేళ్లకే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆరేళ్ల అనంతరం ఆ పార్టీకి సైతం టాటా చెప్పేసి తమిళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 2020 అక్టోబర్ లో బీజేపీలోకి జంప్ చేశారు. ఆమె పాలిటిక్స్ లోకి అడుగుపెట్టినప్పటి నుంచీ ప్రతిపక్షంలోనే ఉంటున్నారు. దీంతో ఏ మీటింగ్ జరిగినా ఆమె ఎదుటివాళ్లను విమర్శించటాన్నే అలవాటు చేసుకున్నారు.

Assembly Elections : name of a assembly constituency is thousand light
Assembly Elections : name of a assembly constituency is thousand light

అలవాటు.. పొరపాటు: Assembly Elections

ప్రస్తుతం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఖుష్బూ అలవాటులో పొరపాటు చేశారు. తన నియోజకవర్గం(థౌజెండ్ లైట్స్)లో పలు సమస్యలున్నాయని, గత ఎమ్మెల్యే ప్రజల ఇబ్బందుల్ని గాలికొదిలేశాడని మండిపడ్డారు. రాజకీయ నాయకులు ప్రత్యర్థులను ఎలా చీల్చిచెండాడుతారో మనకు తెలుసు కదా. ఖుష్బూ కూడా ఆ పాత్రలో జీవించారు. కానీ పక్కనే ఉన్న ఒక నాయకుడికి ఆమె మాటలతో పట్టపగలే చుక్కలు కనిపించాయి. ఎందుకంటే ఖుష్బూతో నానా మాటలూ పడుతున్న ఆ శాసన సభ్యుడు అతడే కాబట్టి. అతని పేరు సెల్వం. పన్నీరు సెల్వం కాదులెండి. ఖుష్బూ కామెంట్లకు తట్టుకోలేక ఎవరో చిన్నగా ఆమె చెవిలో అసలు విషయం ఊదారు. దీంతో ఖుష్బూకి ఏం చేయాలో తెలియక ఖంగుతిన్నారు.

Advertisement