ఎడారుల్లో న‌డుచుకుంటూ వెళ్లి వ్యాక్సిన్ ఇచ్చిన వీర మ‌హిళ‌

క‌రోనా సంక్షోభంలో ఎంద‌రో మృత్యువాత ప‌డ్డారు. చాలా మంది కుటుంబాల్లో తీర‌ని విషాదం నెలకొంది. క‌రోనా స‌మ‌యంలో ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్స్ కూడా ఎన్నో బాధలు ప‌డ్డారు. అయితే క‌రోనా స‌మ‌యంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కొందరు చేసిన సేవ‌లు అనిర్వ‌చ‌నీయం.

TheNewsQube-

Vaccination

వ్యాక్సిన్ వ‌ల‌న కొంత కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. అయితే ప్ర‌తి ఒక్క‌రికి వ్యాక్సిన్ అందించేందుకు ప్ర‌భుత్వాలు ఎంత‌గానో క‌స‌ర‌త్తులు చేస్తున్నాయి. కొంద‌రు ఏఎన్ఎంల స‌హ‌కారంతో వ్యాక్సిన్ అందించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో కొంద‌రు మ‌హిళ‌లు చాలా క‌ష్టాలు ప‌డుతున్నారు.

తాజాగా అనిత‌ అనే మ‌హిళ జైస‌ల్మేర్ జిల్ల‌లోని గ్రామాల్లో టీకాలు వేసేందుకు ఎండ‌ల్లో న‌డుచుకుంటూ కిలోమీట‌ర్స్ దూరం వెళ్లింది. బిడ్డకు మ‌ధుమేహం ఉండ‌డంతో త‌న‌తో పాటు తీసుకెళుతూ ఉండేది. ఎడారుల‌లో ఇసుకు మీద కూర్చొని పిల్ల‌ల‌కు పాలు ఇచ్చేది. అలాంటి వీర మ‌హిళ గాథ ప్ర‌తి ఒక్క‌రికి ఆద‌ర్శంగా నిలుస్తుంద‌ని తేజాస్ మెహ‌తా స్ప‌ష్టం చేశారు.

Vaccination

తేజాస్ మెహతా ఇలాంటి వారి గాథ‌ల‌ను ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు తీస్తూ స‌మాజంలో ఇంకా మంచి త‌నం దాగి ఉంద‌ని చూపిస్తుంటారు. గ‌తంలో ఇలాంటి మ‌హిళ‌ల గాథ‌లు ఎన్నో కూడా మ‌న క‌ళ్ల ముందు ఉంచారు.