Marriage: 20 ఏళ్లు స‌హ‌జీవ‌నం చేసి 60 ఏళ్ల‌కు పెళ్లి చేసుకున్నారు..

Marriage: సహ‌జీవ‌నం సంస్కృతి ఒక‌ప్పుడు విదేశాల‌లో చాలా ఉంది. ఇప్పుడు అది మ‌న దేశానికి కూడా పాకింది. బాలీవుడ్‌లో అయితే డేటింగ్ సంస్కృతి ఎక్కువైంది. చాలా మంది సెల‌బ్రిటీలు ప్రేమ ఆ తర్వాత డేటింగ్ అంటూ కొన్నాళ్ళ స‌మ‌యం గ‌డుపుతున్నారు. ఇప్పుడు డేటింగ్ అనేది చాలా కామన్‌గా మారింది. ఉత్త‌రప్ర‌దేశ్‌కు చెందిన ఓ జంట అయితే రెండు ద‌శాబ్ధాలు స‌హ‌జీవ‌నం చేసి ష‌ష్టిపూర్తి స‌మ‌యంలో పెళ్లి చేసుకున్నారు.

marriage

ఉన్నావ్ జిల్లాలోని ర‌సూల్‌పుర్ రూరీ గ్రామానికి చెందిన న‌రైన రైదాస్‌(60), రామ్‌ర‌తి(55) కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. 2001 నుండి అదే గ్రామంలో స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. గ్రామంలో ప్ర‌జ‌లు వ్య‌తిరేకించిన కూడా ఊరి పెద్ద‌ల‌ను ఒప్పించి స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. ప్ర‌స్తుతం 13 ఏళ్ల కుమారుడు ఉన్నారు.

దాదాపు 20 ఏళ్ల నుండి వీరు పెళ్లి చేసుకోకుండానే ఉన్నారు. అయితే ఇటీవ‌ల ర‌మేష్ కుమార్, సామాజిక కార్య‌క‌ర్త ధ‌రేంద్ర బాజ్‌పేయి క‌లిసి న‌రైన్‌, రామ్‌ర‌తిని వివాహం చేసుకోవాల‌ని కోరారు.వారు, వారి కుమారుడు అవ‌మానాల నుండి త‌ప్పించుకోవాలంటే త‌ప్ప‌క పెళ్లి చేసుకోవాల‌ని అన్నారు. వివాహ వేడుక‌కు ఖ‌ర్చ‌య్యే మొత్తం తాము భ‌రిస్తామ‌ని చెప్పుకొచ్చారు. దీంతో ఈ జంట వివాహం చేసుకోవ‌డానికి అంగీక‌రించింది.

గ్రామ ప్ర‌జ‌లు, క‌న్న కుమారుడి స‌మ‌క్షంలో న‌రైన్, రామ్ రతి వివాహం జ‌ర‌గ‌గా, వీరి పెళ్లి వేడుక‌ను ఘ‌నంగా గ్రామ‌స్తులంతా క‌లిసి నిర్వ‌హించ‌డం విశేషం.ప్ర‌స్తుతం ఈ జంట‌కి సంబంధించిన వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.