బాబోయ్‌..26 ఏళ్లకే 53 మందితో లైంగిక సంబంధం.. న‌లుగురితో పెళ్లి

కొంద‌రు మాయ‌మాట‌లు చెప్పి అమ్మాయిల‌ని వ‌ల‌లో వేసుకుంటున్నారు. సామాజిక మాధ్య‌మాలు వ‌చ్చాక ఇది ఇంకా సులువైంది. ఒక‌డు ఆర్మీ ఆఫీస‌ర్ చెప్పుకొని తిరుగుతూ, త‌న‌కు బాడీ గార్డ్‌గా ఫ్రెండ్‌ని పెట్టుకున్నాడు. వాడు చేస్తున్న మోసాలు అన్నీ ఇన్నీ కావు. ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రూ.లక్షల్లో డబ్బులు తీసుకోవ‌డ‌మే కాక కొంద‌రితో లైంగిక సంబంధాలు పెట్టుకునే వాడు.

26 years Boy Illegal Relation Ship with 53 Girls
26 years Boy Illegal Relation Ship with 53 Girls

నిరుద్యోగ మహిళల ఫోన్ నంబర్లను సంపాధించిన ఇత‌గాడు ఆర్మీ డ్రస్ లో వాళ్లను కలిసేవాడు. వాళ్లు పూర్తిగా నమ్మిన తర్వాత ఉద్యోగం ఆశ చూపి పార్క్ లు, పబ్ లు అంటూ తిరిగేవాడు. ఆర్మీ ఆఫీస‌ర్‌గా త‌న బ్రాండ్ ఎక్క‌డా త‌గ్గ‌కుండా చూసుకునేవాడు. ఇత‌డు నిజంగానే ఆర్మీ ఆఫీస‌ర్ అని న‌మ్మిన కొందరు మ‌హిళ‌లు లైంగిక సంబంధం కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇలా దాదాపు 53 మందితో ఇతడు లైంగిక సంబంధాలను పెట్టుకున్నాడు.

అంతకముందే ఒకరికి తెలియకుండా ఒకరిని నలుగురిని పెళ్లి చేసుకున్నాడు. మహిళల వద్ద డబ్బులు తీసుకొని జాయినింగ్ ఆర్డర్ కాపీ అంటూ ఇచ్చి బురిడీ కొట్టించేవాడు. ఓ రోజు అనుమానం వచ్చిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడి మోసాలు, రాసలీలలు అన్నీ బయట పడ్డాయి. మ‌హారాష్ట్ర‌లో చోటు చేసుకున్న ఈ ఉదంతం అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది.

26 years Boy Illegal Relation Ship with 53 Girls
26 years Boy Illegal Relation Ship with 53 Girls

వివ‌రాల‌లోకి వెళితే మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన యోగేష్ దత్తు గైక్వాడ్ అనే 26 ఏళ్ల వ్యక్తి తన పేరు రామ్‌ అని, తను ఆర్మీలో మేజర్ అని చెప్పుకుంటూ మహిళలతో పరిచయాలు పెంచుకునేవాడు.ఇత‌నికి స‌హాయ‌కుడిగా సంజ‌య్ అనే స్నేహితుడు ఉండేవాడు. మ‌హిళ‌ల‌ను క‌లిసేటప్పుడు ఆర్మీ డ్రెస్‌లోనే వెళ్లేవాడ‌ట‌. ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి 20 మంది నుంచి లక్షల్లో డబ్బులు తీసుకున్నాడు. ఆ డబ్బుతో జల్సా చేసేవాడట‌.

ఉద్యోగం ఇస్తాన‌న్న మ‌హిళ‌ల‌కు ఫేక్ జాయినింగ్ లెట‌ర్స్ క్రియేట్ చేసి మోసం చేశాడు. గత నెల 21న ఓ మహిళ చేసిన ఫిర్యాదుతో యోగేష్ విషయం మొత్తం బయటపడింది. నిజానికి యోగేష్‌పై 2017లోనే పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అప్పట్నుంచి తప్పించుకుని తిరుగుతూ తాజాగా దొరికిపోయాడు. అతడి నుంచి 12 జతల ఆర్మీ యూనిఫార్మ్స్‌ను, 26 జతల షూస్‌ను, రెండు రబ్బర్ స్టాంపులను, రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈయ‌న జాబితాలో ఎక్కువ మంది మ‌హిళ‌లే మోస‌పోవ‌డం గ‌మ‌న‌ర్హం.