Connect with us

Entertainment

పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో క్రేజీ రీమేక్

Published

on

Share the News from here

టాలీవుడ్ లో మల్టి స్టారర్ సినిమాలు సర్వసాధారంగా తీస్తూనే ఉంటారు. ఇక చిన్న హీరోలు మల్టి స్టారర్ చేస్తేనే మంచి ఆదరణ లభిస్తుంది. అలాంటిది పెద్ద హీరోలు మల్టి స్టారర్ గా నటిస్తే ఇక ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి. తాజాగా ఫిలిం నగర్ లో పలు ఆసక్తికరమైన వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్‌, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సినిమా రాబోతుంది అని ప్రచారం జరుగుతుంది. అయితే మలయాళంలో సూపర్ హిట్ చిత్రంగా పేరు పొందిన అయ్యప్పన్నుమ్ కొషియుమ్ ప్రాజెక్టును తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు.

ఇక ఈ ప్రాజెక్టులో పవన్ కళ్యాణ్,‌ రానా హీరోలుగా నటించబోతున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక పవన్ మూవీ షూటింగ్ ఈ నెలలో పూర్తికానుంది. ఈ సినిమా షూటింగ్ అనంతరం మల్టి స్టారర్ షూటింగ్ మొదలవుతుంది అని వార్తలు వస్తున్నాయి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమా డైరెక్టర్ ఎవరన్నా విషయం తెలియాల్సి ఉంది. మరి ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఎప్పుడు చేస్తారో చూడాలి.

Do NOT follow this link or you will be banned from the site!