Connect with us

Entertainment

ధోని ఫ్యాన్ హా.. మజాకా..!

Published

on

Share the News from here

ఐపీఎల్ లో అన్ని టీంల కంటే చెన్నై సూపర్ కింగ్స్ టీంకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఎందుకంటె ఆ జట్టులో మహేంద్ర సింగ్ ధోని ఉండడమే కారణమని చెప్పాలి. మాములుగా ఫాన్స్ తమ అభిమానాన్ని వింతవింత విధానాల్లో బయట పెడ్తారు. కానీ ఒక అభిమాని మాత్రం వినూత్న రీతిలో తన అభిమానాన్ని నిరూపించుకున్నాడు. వివరాల్లోకి వెళితే తమిళనాడులోని కడలూరుకు చెందిన చెన్నై సూపర్ కింగ్స్‌ ఫ్యాన్‌ గోపీ కృష్ణన్‌ తన ఇంటిని చెన్నై జెర్సీ రంగులు వేయించాడు.

అలాగే ఆ జట్టు లోగో, ధోనీ ఫొటోలను ఇంటి గోడల పై పెయింటింగ్‌ వేయించాడు. అంతేకాకుండా తన నివాస గృహానికి ‘హోమ్‌ ఆఫ్‌ ధోనీ ఫ్యాన్’ అని కూడా పేరు అని పెట్టుకున్నాడు ఆ వీరాభిమాని. ప్రస్తుతం ఆ ఇల్లు మొత్తం ఎల్లో రంగులో మెరిసిపోతుంది. ఆ ఇంటికి రంగులు వేయించేందుకు గోపీ కృష్ణన్‌ 1.5లక్షల రూపాయలు ఖర్చు చేసాడు. ప్రస్తుతం ఆ ఇంటి ఫొటోలు సోషల్ ‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Do NOT follow this link or you will be banned from the site!