Ambati Rambabu : పండ‌గ వేళ చిందులేసిన అంబ‌టి రాంబాబు.. చ‌క్క‌ర్లు కొడుతున్న వీడియో

Ambati Rambabu : తెలుగు రాష్ట్రాల‌లో భోగి సంద‌డి నెల‌కొంది. పిల్ల‌లు, పెద్ద‌లు సంతోషంగా ఈ వేడుక‌ని జ‌రుపుకుంటున్నారు. సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు వేడుక‌ల‌లో పాల్గొంటూ సంద‌డి చేస్తున్నారు. ఇక, ఈ సారి వైసీపీ ఎమ్మెల్యేలు సండది మూమూలుగా లేదు. వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా కడప జిల్లా శెట్టిపల్లిలో భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయాన్నే భోగి మంటల చుట్టూ తిరుగుతూ ఆనందం పంచుకున్నారు.

YSRCP MLA Ambati Rambabu Dance
YSRCP MLA Ambati Rambabu Dance

మరో సీనియర్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు భోగి వేడులను ఈ సారి మరింత ప్రత్యేకంగా నిర్వహించారు. భోగి మంటల చుట్టూ డాన్స్ వేసారు. గాంధీ బొమ్మ సెంటర్‌లో సాంప్రదాయబద్దంగా భోగి మంటలు వేశారు. అనంతరం ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. మహిళలలో హుషారుగా డ్యాన్స్‌ చేసి అక్కడ ఉన్నవారిని ఉత్సాహపరిచారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భోగి సంబరాల్లో పాల్గొనటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రజలకు తోడుగా జగనన్న సంక్షేమ పథకాలు ఉన్నాయన్నారు.ఎప్పుడూ పదునైన మాటలతో ప్రత్యర్దుల పైన విరుచుకుపడే అంబటి రాంబాబు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసారు. మెగాస్టార్ చిరంజీవి సీఎం జగన్ తో సమావేశం.. ఆ తరువాత ఆయన స్పందించిన తీరు పైన అంబటి రియాక్ట్ అయ్యారు. “అన్నయ్య” ను చూసి నేర్చుకో “తమ్మడూ ” అంటూ పంచ్ వేసారు.

సత్తెనపల్లిలో అంబటి రాంబాబు పండుగ వేడుకలు జరుపుకుంటున్నారు. కరోనా సమయంలో మరింతగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక, ఇప్పుడు అంబటి రాంబాబు భోగా మంటల చుట్టూ వేసిన స్టెప్పులు.. డాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన డాన్స్ పైన పెద్ద ఎత్తున కామెంట్స్ పోస్టు చేస్తున్నారు. అంబటి డాన్స్ ను పలువురు ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.