Young Tiger NTR : ‘ఆర్ఆర్ఆర్’ అనుభూతుల్ని జపాన్ మీడియాతో పంచుకున్న ఎన్టీయార్.! పిక్స్ వైరల్.!

NQ Staff - October 4, 2022 / 07:27 PM IST

Young Tiger NTR : ‘ఆర్ఆర్ఆర్’ అనుభూతుల్ని జపాన్ మీడియాతో పంచుకున్న ఎన్టీయార్.! పిక్స్ వైరల్.!

Young Tiger NTR : యంగ్ టైగర్ ఎన్టీయార్, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అటు యంగ్ టైగర్ ఎన్టీయార్, ఇంకోపక్క దర్శకుడు రాజమౌళి.. ఈ ముగ్గురికీ ప్రపంచ వ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టింది.

నిజానికి, ‘బాహుబలి’తోనే రాజమౌళి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. అయితే, ఈసారి ఇంకాస్త ప్రత్యేకం. ‘ఆర్ఆర్ఆర్’ కనీ వినీ ఎరుగని విజయాన్ని, ప్రపంచ యవనికపై చాటిందన్నది నిర్వివాదాంశం.

జపాన్ మీడియాతో ఎన్టీయార్..

నెట్‌ఫ్లిక్స్ ద్వారా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రపంచ వ్యాప్త ప్రేక్షకుల్ని అలరిస్తోన్న విషయం విదితమే. సినిమా థియేటర్లలో విడుదలై, ఆ తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ షురూ అయి కూడా నెలలు గడుస్తోంది. అయినాగానీ, ప్రపంచ వ్యాప్తంగా ఇంకా ఈ సినిమా ట్రెండింగ్‌లో కొనసాగుతూనే వుంది.

తాజాగా, జపాన్ మీడియాతో యంగ్ టైగర్ ఎన్టీయార్ ఇంటరాక్ట్ అయ్యాడు.. అదీ వీడియో కాల్ ద్వారా. ‘ఆర్ఆర్ఆర్’ అనుభవాల్ని జపాన్ మీడియాతో యంగ్ టైగర్ ఎన్టీయార్ పంచుకున్నాడు. తెలుగు సినిమా మార్కెట్, జాతీయ స్థాయిని దాటి, ప్రపంచ స్థాయికి చేరిపోయింది.

కేవలం ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగువారే కాదు, అన్నిదేశాలకు చెందినవారూ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని ఆదరిస్తుండడం గమనార్హం.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us