Yedukondalu And Kirak RP : నా దగ్గర వారి ఆధారాలు ఉన్నాయి.. ఎక్స్‌ట్రా చేస్తా కట్ చేస్తానంటూ మల్లెమాల ఏడు కొండలు వార్నింగ్
NQ Staff - July 15, 2022 / 09:04 PM IST

Yedukondalu And Kirak RP : కొద్ది రోజుల క్రితం కిరాక్ ఆర్పీ నాగబాబుని పొగొడుతూ జబర్ధస్త్‌తో పాటు మల్లెమాలపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆర్పీ చేసిన ఆరోపణలను హైపర్ ఆది, షేకింగ్ శేషు, ఆటో రాంప్రసాద్ ఖండించారు. ఇక తాజాగా జబర్దస్త్ షో ప్రారంభం నుండి మేనేజర్ గా ఉన్న ఏడుకొండలు సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కిరాక్ ఆర్పీతో పాటు సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనుపై విరుచుకుపడ్డారు.
స్ట్రాంగ్ వార్నింగ్
స్వశక్తితో ఎదిగిన శ్యామ్ ప్రసాద్ రెడ్డిపై కిరాక్ ఆర్పీ ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. తండ్రి ఎంఎస్ రెడ్డి సప్పోర్ట్ లేకుండానే స్నేహితుల సహకారంతో నిర్మాతగా మారి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గొప్ప చిత్రాలు నిర్మించారని, అన్నారు. కిరాక్ ఆర్పీ జబర్దస్త్ ని వదిలి 4 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడని ఏడుకొండలు నిలదీశాడు.
డైరెక్టర్ గా మారి ఆర్పీ నిర్మాతలను ఇబ్బంది పెట్టినట్లు వెల్లడించారు. తన సినిమాకి మేనేజర్‌గా ఆర్పీ 50వేల రూపాయలకు ఓకే చెప్పాడు. వాడిపై నాకు నమ్మకం లేక అడ్వాన్స్ గా ఇచ్చిన యాభైవేలు ఇంట్లోనే ఉంచాను. ఇక టెక్నీషియన్స్, నటులను ఎప్పటికప్పుడు మారుస్తూ గందరగోళం చేశాడు. చివరికి కొంత డబ్బులు ఖర్చు చేసి ఆ సినిమా చేయనని నిర్మాతలకు హ్యాండిచ్చాడు అంటూ కిరాక్ ఆర్పీ బండారం బయటపెట్టారు.

Yedukondalu Expressed Anger at Kirak RP
అలాగే సుధీర్, గెటప్ శ్రీనులను ఉద్దేశిస్తూ ఏడుకొండలు కొన్ని తీవ్ర ఆరోపణలు చేశారు. గెటప్ శీను వేరే షో చేసే అవకాశం లేదు. ఏదన్నా ఎక్కువగా మాట్లాడితే ఆధారాలతో సహా బండారం బయట పెడతానని హెచ్చరించాడు ఏడు కొండలు. ఎక్కడో ఉన్నవాడిని తీసుకొచ్చి లైఫ్ ఇస్తే ఇప్పుడు తన ఫోన్ కూడా ఎత్తడం లేదంటున్నాడు.
ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం పది సార్లు కాల్ చేస్తే ఒకసారి ఎత్తాడు. నేను విషయం చెప్పగానే నా మేనేజర్ తో మాట్లాడు అన్నాడు. రోజా, నాగబాబులతోనే నేరుగా మాట్లాడేవాడిని, ఇప్పుడు సుధీర్ మేనేజర్‌తో మాట్లాడాలి అంట. నేను సినిమాల్లో బిజీ అంటాడు, సుధీర్ చేసిన ఏ సినిమా ఆడిందో చెప్పమనండి, నేను లైఫ్ ఇస్తే నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని ఏడుకొండలు ఆవేదన వ్యక్తం చేశారు.
జబర్దస్త్ కి పోటీగా మొదలైన కామెడీ స్టార్స్ కి కనీసం 5 టీఆర్పీ రావడం లేదు. ప్రస్తుతం జబర్దస్త్ టీఆర్పీ తగ్గినప్పటికీ కామెడీ స్టార్స్ కంటే మెరుగైన టీఆర్పీ రాబడుతున్నట్లు ఏడుకొండలు తెలిపారు.