Yashoda Movie : ‘యశోద’ 33 కోట్లు.! సమంత స్టామినా ఇదీ.!
NQ Staff - November 21, 2022 / 05:34 PM IST

Yashoda Movie : సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘యశోద’ సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కిన సంగతి తెలిసిందే. కొంత మిక్స్డ్ టాక్ తొలిరోజు వచ్చినాగానీ, సమంత స్టామినా ఈ సినిమాతో ఇంకోసారి నిరూపితమయ్యింది. ‘యశోద’ 30 కోట్ల వసూళ్ళ మైలు రాయిని ఇప్పటికే అధిగమించేసింది.
తాజాగా, ఈ సినిమా 33కోట్ల మార్కుని అందుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన వసూళ్ళ లెక్కలివి. అయితే, ఇది గ్రాస్ లెక్క.
నలభై కోట్ల క్లబ్బులోకి వెళుతుందా.?
‘యశోద’ నలభై కోట్ల క్లబ్బులోకి చేరుతుందా.? లేదా.? అంటే, దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసాధ్యమైన విషయమైతే కాదు. ఒకవేళ నలభై కోట్ల క్లబ్బులోకి చేరితే, అది అద్భుతమనే భావించాల్సి వుంటుంది.
హరి హరీష్ దర్శకత్వంలో ‘యశోద’ సినిమా తెరకెక్కింది. వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు ఈ సినిమాలో ఇతర ప్రధాన తారాగణం. థియేటర్లకు జనం బాగానే వస్తుండడంతో చిత్ర నిర్మాణ సంస్థ ‘యశోద’ మూవీని ఓటీటీలో విడుదల చేసే విషయమై తటపటాయిస్తోంది.
అయితే, ఓటీటీ నుంచి తొందరగా విడుదల చేసేందుకోసం ట్రెమెండస్ ఆఫర్ నిర్మాతల ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.