Yash : య‌ష్ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ కోసం ప్రిన్సిపాల్‌కి లేఖ రాసిన అభిమాని

Yash : క‌న్న‌డ స్టార్ హీరో య‌ష్ చిన్న స్థాయి నుండి ఇప్పుడు స్టార్ హీరోగా మారాడు. ఆయ‌నకు ఇప్పుడు దేశ విదేశాల‌లో అశేష‌మైన అభిమానులు ఉన్నారు. కేజీఎఫ్ చిత్రంతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన య‌ష్ ఇప్పుడు త్వ‌ర‌లో కేజీఎఫ్ 2 చిత్రంతో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. నిన్న బ‌ర్త్ డే సంద‌ర్భంగా చిత్రం నుంచి ఓ కొత్త పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

Yash birthday a fan write a latter for school principal
Yash birthday a fan write a latter for school principal

చిత్ర నిర్మాత విజ‌య్ కిరంగ‌దూర్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేస్తూ ‘‘కొత్త లక్ష్యాల‌ను సృష్టించ‌డానికి నువ్వొక నిజ‌మైన స్ఫూర్తినిచ్చావు. ఈ ఎదుగుద‌ల‌లో నీతో కలిసి కొత్త క‌థ‌ను క్రియేట్ చేయాల‌నుకుంటున్నాం. కొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తామ‌నే న‌మ్మ‌కం ఉంది. మ‌రిన్ని అప్‌డేట్స్ వ‌స్తాయి’’ అంటూ య‌ష్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే య‌ష్ ఇన్‌టెన్స్‌గా చూస్తున్నారు. ఆయ‌న ప‌క్క‌నున్న సైనింగ్ బోర్డులో ప్ర‌మాదం ముందుంది అని రాసి ఉండ‌టాన్ని చూడొచ్చు.

Yash birthday a fan write a latter for school principal
Yash birthday a fan write a latter for school principal

కేజీఎఫ్‌తో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకొన్న యష్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. యష్ తండ్రి కర్ఠాటక స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్లో బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. చిన్నతనం నుంచి నటుడి కావాలనే కోరికతో ఉన్న యష్ బెంగళూరు‌కు తన మకాం మార్చుకొన్నారు. చిన్న చిన్న పాత్రలతో కేజీఎఫ్ వరకు చేరుకొన్నారు.

కేజీఎఫ్ రిలీజ్ తర్వాత ఓవర్‌నైట్‌లో స్టార్ హీరో అయ్యారు. బాలీవుడ్‌తోపాటు అన్ని సినీ పరిశ్రమలు ఆయన వైపు వెనక్కు తిరిగి చూశాయి. కేజీఎఫ్ తర్వాత దక్షిణాదిలో అత్యధిక పారితోషికంగా అందుకొనే హీరోల జాబితాలో యష్ చేరిపోయారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 15 కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకొన్నారు.

కేజీఎఫ్ తర్వాత యష్‌కు అన్ని భాషల్లోను విశేషంగా అభిమానులు పెరిగిపోయారు. తాజాగా ఓ అభిమాని రాసిన లేఖ మీడియాలో వైరల్ అవుతున్నది. బళ్లారికి చెందిన ఓ కాలేజ్ స్టూడెంట్ కే శివ కుమార్ తన అభిమాన హీరో పుట్టిన రోజు వేడుకను ఆన్‌లైన్‌లో జరుపుకోనేందుకు సెలవు ఇవ్వాలని ప్రిన్స్‌పాల్‌కు లేఖ రాశారు. కోవిడ్ కారణంగా ఆంక్షలు ఉండటంతో ఆన్‌లైన్‌తో తన ఫేవరేట్ హీరో బర్త్ డేను ఘనంగా నిర్వహించేందుకు కాలేజ్ ఆంక్షలు అడ్డుగా మారాయి.

శివకుమార్ చదివే కాలేజ్‌లో అటెండెన్స్ విషయంలో చాలా సీరియస్‌గా ఉండటంతో కాలేజ్‌ నుంచి బయటకు రావడం కష్టంగా మారడంతో ప్రిన్స్‌పాల్ అనుమతి కోరుతూ లేఖ రాశాడు. వేరే కారణాలు చెప్పకుండా నిజాయితీగా తన సమస్యను లేఖలో పొందుపరిచాడు. శివకుమార్ అభిమానాన్ని చూసి, లేఖలో ఆయన చెప్పిన విషయాలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.