Bigg Boss Season 6 : శ్రీ సత్య మరో బిందు మాధవి అవుతుందా బిగ్ బాస్.?
NQ Staff - September 6, 2022 / 04:30 PM IST

Bigg Boss Season 6 : బిగ్ బాస్ విన్నర్ ఎవరవుతారు.? అన్నదానిపై ఇప్పుడే ఓ కంక్లూజన్‌కి వచ్చేయలేం. కానీ, శ్రీ సత్య మరో బిందు మాధవి అవుతుందేమో.. అన్న అభిప్రాయమైతే బిగ్ బాస్ వ్యూయర్స్‌లో వ్యక్తమవుతోంది. విన్నర్ అవుతుందా.? లేదా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, శ్రీ సత్య ఒకింత ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనిపిస్తోంది ఈసీజన్ కంటెస్టెంట్లలో.
శ్రీ సత్య అంటే బుల్లితెర వీక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పలు సీరియళ్ళలో బబ్లీ రోల్స్ చేసింది శ్రీ సత్య. సోషల్ మీడియాలోనూ కాస్త యాక్టివ్‌గానే వుంటుంది.
బిగ్ బాస్ లెక్కే వేరు..

Will Sri Satya Be winner Of Bigg Boss Season 6
సినిమాల్లో ఎలా వున్నారు.? సీరియల్స్‌లో ఏం చేశారు.? అన్నది వేరే లెక్క. బిగ్ హౌస్‌లో ఏం చేస్తున్నారన్నదే ముఖ్యం. ఆటిట్యూడ్ అవసరమైనప్పుడు చూపించాలి.. అణిగిమణిగి వుండాల్సినప్పుడు అలాగే వుండాలి కూడా.
అంతిమంగా ఆడియన్స్‌ని విపరీతంగా ఎట్రాక్ట్ చేయాలి. ఆడియన్స్ ఎలా కనెక్ట్ అవుతారనే కిటుకులూ తెలియాలి. కెమెరా ఫేవర్ అన్నట్లుండాలి.. బిగ్ బాస్ మనసూ గెలుచుకోవాలి. ఇప్పటికైతే బబ్లీ.. అన్న ఇమేజ్ కాస్త బిల్డప్ అవుతూ వస్తోంది శ్రీ సత్య మీద.
గేమ్ ఎలా ఆడుతుంది.? అన్నది వేరే చర్చ.. ముందైతే బిగ్ బాస్ వ్యూయర్స్ మైండ్స్‌లో తనదైన ఇంపాక్ట్ ఆ బబ్లీనెస్‌తో అయినా వేయాల్సిందే.