Allu Arjun : అల్లు అర్జున్ ఎందుకు పవన్ కళ్యాణ్‌కి బర్త్ డే విషెస్ చెప్పలేదు.?
NQ Staff - September 4, 2022 / 06:41 PM IST

Allu Arjun : చెప్పను బ్రదర్.. అంటూ చాలాకాలం క్రితం పవన్ కళ్యాణ్ అభిమానుల్ని అత్యంత వ్యూహాత్మకంగా కెలికేశాడు అల్లు అర్జున్. అప్పటినుంచే మెగా కాంపౌండ్‌లో రచ్చ మొదలైంది. నిజానికి, మెగా కాంపౌండ్.. అనడం కంటే, మెగా కాంపౌండ్ అభిమానుల్లో అనడం సబబేమో.

Why didn’t Allu Arjun wish Pawan Kalyan on his birthday
మెగాస్టార్ చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు.. ఇలా వేరు పడటానికి అల్లు అర్జున్ చేసిన ‘చెప్పను బ్రదర్’ కామెంట్‌తోనే బీజం పడిందంటారు చాలామంది.
పవన్ కళ్యాణ్‌ని లైట్ తీసుకున్న అల్లు అర్జున్..
చిరంజీవినే లైట్ తీసుకున్న అల్లు అర్జున్‌కి పవన్ కళ్యాణ్‌ని పక్కన పెట్టడం పెద్ద విషయం కాదు కదా.? అన్న వాదన వుంది. అల్లు కాంపౌండ్‌ని తెరవెనుకాల పెయిడ్ అభిమానులతో అల్లు అర్జున్ ప్రమోట్ చేస్తున్నాడన్న ప్రచారమైతే వుంది. ఆ పెయిడ్ బ్యాచ్, మెగా హీరోలపై చిమ్ముతోన్న విషం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
తాజాగా, పవన్ కళ్యాణ్ పుట్టినరోజునాడు సోషల్ మీడియా వేదికగా కనీసం ఓ ట్వీటు కూడా వేయలేకపోయాడు అల్లు అర్జున్. కావాలనే, అల్లు అర్జున్ ఇదంతా చేస్తున్నాడన్న సంకేతాలైతే బలంగా వెళ్ళాయ్.! అయితే, పవన్ కళ్యాణ్‌కి నేరుగా అల్లు అర్జున్ ఫోన్ చేసి విషెస్ అందించి వుండొచ్చుగా.? అన్న వాదనా లేకపోలేదు.
ఏమో, ఈ రచ్చ సంగతేమోగానీ.. అభిమానులైతే సోషల్ మీడియా వేదికగా వేరుపడి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అత్యంత జుగుప్సాకరంగా సెలబ్రిటీలను తిట్టిపోస్తున్నారు.