Junior Artist Priyanka : జూనియర్ ఆర్టిస్టుపై అత్యాచారం.! వర్ధమాన నటుడి అరెస్ట్.!
NQ Staff - October 12, 2022 / 01:46 PM IST

Junior Artist Priyanka : ఓ జూనియర్ ఆర్టిస్టుపై వర్ధమాన నటుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాల్ని కులం పేరుతో దూషించి, ఆమెపై నిందితుడు అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు, నిందితుడ్ని అరెస్టఉ చేశారు.
వివరాల్లోకి వెళితే, బాధితురాలి పేరు ప్రియాంక అని తెలుస్తోంది. నిందితుడి పేరు విశ్వాంత్. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీసుల అదుపులో వున్నాడు నిందితుడు.
గ్లామర్ ప్రపంచంలో మత్తు, గమ్మత్తు.!
గ్లామర్ ప్రపంచంలో ఈ తరహా ఘటనలు ఇటీవలి కాలంలో సర్వసాధారణమై పోయాయి. గ్లామర్ రంగంపై ఆసక్తితో వచ్చే యువతులు, కొందరు కేటుగాళ్ళ మాయలో పడి, జీవితాల్ని నాశనం చేసుకుంటుంటారు. ప్రియాంక కూడా కూడా ఇలాగే, బాధితుడి వలలో చిక్కి వుంటుందని అనుమానిస్తున్నారు.
కొంత కాలంగా బాధితురాలితో విశ్వాంత్ అనే నటుడు సన్నిహితంగా వుంటున్నాడనీ, ఇద్దరి మధ్యా మనస్పర్ధలు రావడంతో నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడనీ అంటున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.