Vishwak Sen : విశ్వక్ సేన్ తగ్గేదే లే.! ‘ఓరి దేవుడా’కి ముందు, తర్వాత.. ఏంటీ లొల్లి.?

NQ Staff - October 7, 2022 / 09:54 PM IST

Vishwak Sen : విశ్వక్ సేన్ తగ్గేదే లే.! ‘ఓరి దేవుడా’కి ముందు, తర్వాత.. ఏంటీ లొల్లి.?

Vishwak Sen : ‘ఓరి దేవుడా’ సినిమాకి ముందు.. ఆ తర్వాత.. అని నా కెరీర్ గురించి అంతా మాట్లాడుకుంటారంటూ తన తాజా చిత్రం ‘ఓరి దేవుడా’ ట్రైలర్ విడుదల సందర్భంగా విశ్వక్ సేన్ వ్యాఖ్యానించడంపై బోల్డంత ట్రోలింగ్ నడుస్తోంది.

ఏ నటుడికైనా అంతే.. అంతకు ముందు, ఆ తర్వాత.. అని ప్రతి సినిమాతోనూ అనిపించుకోవాలనిపిస్తుంటుంది. విశ్వక్ సేన్ ఇందుకు మినహాయింపేమీ కాదు. కాకపోతే, తన సినిమాని ప్రమోట్ చేసుకునే క్రమంలో చాలా చాలా వెర్రి వేషాలు వేస్తుంటాడు యంగ్ హీరో విశ్వక్ సేన్.

మాస్ కా దాస్.. పబ్లిసిటీ పీక్స్…

ఈ మధ్య విశ్వక్ సేన్ సినిమాలు గొప్పగా ఏమీ ఆడటంలేదు. కానీ, వాటిల్ని ప్రమోట్ చేసుకోవడానికి చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తూ, ఫ్యాన్స్ అనబడే కొంతమంది యూత్‌ని రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నాడు విశ్వక్ సేన్.

ఆ మధ్య ఓ ఛానల్ న్యూస్ రీడర్‌తో ఇలాగే పెద్ద పంచాయితీ పెట్టుకున్నాడు. అది అప్పట్లో విశ్వక్ సేన్ సినిమాకి బాగా కలిసొచ్చింది. ఈసారి కూడా ఏదో కొత్త పబ్లిసిటీ స్టంట్‌ని విశ్వక్ సేన్ ప్లాన్ చేసే వుంటాడు.

అన్నట్టు, ఈ ‘ఓరి దేవుడా’ సినిమాలో సీనియర్ హీరో వెంకటేష్ ఓ కీలక పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే. ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్‌గానే వుంది. అవసరమైతే తగినంత బజ్ క్రియేట్ చేయడానికి విశ్వక్ సేన్ దగ్గర పరమ చెత్త పబ్లిసిటీ ఐడియాలు ఎలాగూ వుంటాయ్.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us