Vishwak Sen And Arjun :  విశ్వక్‌సేన్ ఔట్‌.. ఆ ఇద్దరితో అర్జున్ సంప్రదింపులు

NQ Staff - November 9, 2022 / 03:01 PM IST

Vishwak Sen And Arjun :  విశ్వక్‌సేన్ ఔట్‌.. ఆ ఇద్దరితో అర్జున్ సంప్రదింపులు

Vishwak Sen And Arjun : యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా ఒక సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ కార్యక్రమం జరుగుతున్న సమయం లో విశ్వక్సేన్ మరియు అర్జున్ మధ్య విభేదాలు తలెత్తాయి.

తాను చెప్పిన మార్పులు చేర్పులు చేయడం లేదంటూ హీరో విశ్వక్ సేన్ షూటింగ్ కి హాజరు అవ్వక పోవడంతో పలు షెడ్యూల్స్ క్యాన్సల్ అయ్యాయి అంటూ అర్జున్ వ్యక్తం చేస్తూ మీడియా సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

సినిమా నుండి విశ్వక్ సేన్ తప్పుకున్నట్లే అంటూ క్లారిటీ వచ్చింది. దాంతో అర్జున్ ఇప్పుడు ఆ సినిమా కు మరో హీరోని ఎంపిక చేసి.. ఆ హీరోతో సినిమాను తెరకెక్కించి సక్సెస్ దక్కించుకుని విశ్వక్‌సేన్ పై కక్ష సాధించాలనే పట్టుదలతో అర్జున్ ఉన్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవల అర్జున్.. కిరణ్ అబ్బవరం మరియు శర్వానంద్ లతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది. ఈ ఇద్దరు హీరోల్లో ఎవరో ఒకరు విశ్వక్సేన్ ప్లేస్ లో అర్జున్ సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయి అంటూ సమాచారం అందుతుంది.

ఈ సినిమాతో అర్జున్ తన కూతురు ఐశ్వర్య అర్జున్‌ ని తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నాడు. కనుక ఈ సినిమా అర్జున్ కి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. శర్వానంద్ ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలకు కమిట్ అవ్వడం లేదు, కనుక ఈ సినిమాను ఆయన చేసే అవకాశాలు ఉన్నాయంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే కిరణ్ అబ్బవరం ఈ సినిమా చేస్తే బాగుంటుందని కొందరు అంటున్నారు. మరి ఇద్దరిలో ఎవరు అర్జున్ కి ఓకే చెప్తారో చూడాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us