Vishnu Priya : విష్ణుప్రియ ఫేస్‌ బుక్‌ ఖాతాలోనే అశ్లీల వీడియోలు.. కావాలనే ఫిర్యాదు చేయట్లేదా..?

NQ Staff - January 20, 2023 / 09:55 AM IST

Vishnu Priya : విష్ణుప్రియ ఫేస్‌ బుక్‌ ఖాతాలోనే అశ్లీల వీడియోలు.. కావాలనే ఫిర్యాదు చేయట్లేదా..?

Vishnu Priya : విష్ణుప్రియ గురించి అందరికీ బాగా తెలుసు. ఆమె మొదట్లో చిన్న వెబ్‌ సిరీస్‌ లలో నటించేంది. కానీ ఒక్కసారిగా పోవే పోరా షోతో అదృష్టం పట్టుకుంది. ఈ షోతో ఒక్కసారిగా పాపులర్‌ యాంకర్‌ అయిపోయింది. దెబ్బకు ఆమెకు సోషల్ మీడియాలో కూడా భారీగా ఫాలోవర్లు పెరిగారు. ఆ తర్వాత ఆమె చాలా ఈవెంట్లలో పాల్గొంది. సినిమాల్లో కూడా బాగానే ఆఫర్లు వస్తున్నాయి.

ఇప్పుడు చేతినిండా ఆఫర్లతో ఫుల్‌ జోష్ లో కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. మొదట్లో ఆమె సినిమాల్లో కాస్త వల్గర్‌ రోల్స్‌ చేసేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం లిప్‌ లాక్‌ లు, రొమాంటిక్‌ సీన్లలో బాగానే రెచ్చిపోతోంది. దాంతో ఆమె గురించి బాగానే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆమెకు సోషల్‌ మీడియాలో భారీగా ఫాలోయింగ్‌ పెరుగుతోంది.

అన్‌ ఫాలో చేయాలంటూ..

ఆమెకు ఫేస్‌ బుక్‌ ఖాతాలో 3.7 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. కాగా రీసెంట్ గా ఆమె ఫేస్‌ బుక్‌ ఖాతా హ్యాక్‌ అయినట్టు చెప్పింది. అందులో అశ్లీల వీడియోలు, ఫొటోలు పోస్టు అవుతున్నాయని, దయచేసి కొద్ది రోజులు తన ఫేస్‌ బుక్‌ ఖాతాను అన్‌ ఫాలో చేయాలంటూ కోరింది. మధ్యలో కొన్ని రోజులు అంతా సెట్‌ అయింది.

కానీ ఈ నడుమ మళ్లీ అశ్లీల వీడియోలు వస్తున్నాయి. దాంతో విష్ణుప్రియ మళ్లీ స్పందించింది. ఆ వీడియోలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన ఫేస్ బుక్‌ ఖాతా ఇంకా హ్యాక్‌ లోనే ఉందంటూ తెలిపింది. కానీ జనాలకు చాలా అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఆమె సైబర్‌ క్రైమ్‌ను ఆశ్రయించట్లేదు. ఈ అశ్లీల వీడియోలు వస్తున్నప్పటి నుంచే ఆమె ఖాతాకు బాగా ఫాలోవర్లు పెరుగుతున్నారు. అంటే ఆమెనే కావాలని పోస్టు చేసి హ్యాక్‌ అయిందని చెబుతోందేమో అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us