Virat Kohli : కొత్త జంటకు రూ.2 కోట్ల ఖరీదైన బహుమానం ఇచ్చిన కోహ్లీ
NQ Staff - January 25, 2023 / 10:21 PM IST

Virat Kohli : టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన టీమ్ మెంబర్ కేఎల్ రాహుల్ పెళ్లికి ఏకంగా రెండు కోట్ల రూపాయల విలువ చేసే బీఎండబ్ల్యూ కారును బహుమానంగా ఇచ్చాడు. రాహుల్ పెళ్లి కానుకల్లో ఇదే అత్యంత ఖరీదైన కానుకగా బాలీవుడ్ మరియు ముంబై వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
క్రికెటర్ కేఎల్ రాహుల్ మరియు అతియా శెట్టిలు గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు కూడా ఇరువురు కుటుంబ పెద్దలను ఒప్పించి ఇటీవలే ఒక్కటి అయ్యారు. వీరి వివాహం ఇటీవలే ముంబైలో జరిగింది.
బాలీవుడ్ స్టార్ అయిన సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి అనే విషయం తెల్సిందే. ఈ కేఎల్ రాహుల్ వివాహంకు బాలీవుడ్ ప్రముఖులు హాజరు అయ్యారు. అతియా శెట్టి ఇప్పటికే ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. బాలీవుడ్ ప్రముఖులతో పాటు క్రికెట్ ప్రముఖులు పెళ్లికి హాజరు అయ్యి కొత్త దంపతులను ఆశీర్వదించారు.
కోహ్లీ రెండు కోట్ల విలువైన కారును కొత్త జంటకు బహుమానంగా ఇవ్వగా.. మరో మాజీ కెప్టెన్ ధోనీ రూ.80 లక్షల ఖరీదు చేసే నింజ మోటర్ సైకిల్ ను గిఫ్ట్ గా ఇచ్చాడని తెలుస్తోంది. ఇంకా బాలీవుడ్ తో పాటు క్రికెట్ కు చెందిన మిత్రులు కొత్త జంటకు లక్షల్లో విలువ చేసే బహుమానాలు ఇచ్చారు.