Virat Kohli : సోష‌ల్ మీడియాలో విరాట్ ఒక్క పోస్ట్ ధ‌ర ఎంతో తెలిస్తే అవాక్క‌వ్వాల్సిందే..!

Virat Kohli : విరాట్ కోహ్లీ..ఈ పేరుకి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. టీమిండియా క్రికెట్‌లో సంచ‌ల‌నంగా పేరొందిన విరాట్ కోహ్లీ 2017, డిసెంబర్ 11న అనుష్క శర్మని పెళ్లి చేసుకున్నాడు. నిజానికి విరాట్ కోహ్లీ కంటే అనుష్క శర్మ ఆరు నెలలు పెద్ద కూడా. అనుష్క శర్మ 1988, మే 1న జన్మిస్తే, విరాట్ కోహ్లీ నవంబర్ 5, 1988న జన్మించాడు. ఈ ఇద్ద‌రు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. వీరికి వామిక అనే కూతురు జ‌న్మించ‌గా ఆమెతో కూడా చాలా స‌ర‌దాగా గ‌డుపుతూ ఉంటారు.

Virat Kohli and Anushka Sharma daughter vamika photos
Virat Kohli and Anushka Sharma daughter vamika photos

విరాట్ కోహ్లీ, అనుష్క‌శ‌ర్మ ఇద్ద‌రు సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. వారి ప‌ర్స‌న‌ల్‌తో పాటు ప్రొఫెష‌న‌ల్ విష‌యాలు అప్పుడ‌ప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే వీరు సోష‌ల్ మీడియా పోస్ట్‌ల ద్వారా బాగానే ఆర్జిస్తున్నారు. గతేడాది టాప్‌-20లో ఉన్న సెలబ్రిటీల్లో టీమిండియా టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఒక్కడికే చోటు దక్కింది.

కోహ్లి ఒక్కో పోస్టుకు సుమారు 680,000 డాలర్లు(మన కరెన్సీలో దాదాపు 5.08 కోట్లు) అందుకుంటున్నాడు. ఇక ఇప్పటి వరకు తన ఆట, యాడ్స్‌.. ప్రమోషన్లు… భార్య, బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శర్మతో ఉన్న ఫొటోలు షేర్‌ చేసిన కోహ్లి… తన గారాల పట్టి వామిక ఫొటోను మాత్రం రివీల్‌ చేయలేదు. జనవరి 11 వామిక తొలి పుట్టిన రోజు నేపథ్యంలో కూతురి ఫొటో రివీల్ చేస్తార‌ని అంద‌రు భావిస్తున్నారు.

కోహ్లీ త‌న కూతురి ఫొటో రివీల్ చేస్త మాత్రం ఆ ఫొటోకి లైకులు, కామెంట్ల వ‌ర్షం కుర‌వ‌డం ఖాయం. కాగా కోహ్లికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటివరకు 177 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక చివరిసారిగా తన తల్లి పుట్టినరోజు సందర్భంగా ఆమెతో కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేశాడు కోహ్లి. ప్రస్తుతం అతడు దక్షిణాఫ్రికా టూర్‌లో ఉన్నాడు.

పెళ్లికి ముందు నాలుగేళ్ల పాటు డేటింగ్ చేశారు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ. పెళ్లైన తర్వాత బిజీ షెడ్యూల్ కారణంగా మొదటి ఏడాది కేవలం 22 రోజులు మాత్రమే కలిసి ఉన్నామని అప్ప‌ట్లో ప్రకటించింది విరుష్క జోడి.