Vijayashanti : టాలీవుడ్ హీరోల‌కు కౌంట‌ర్ ఇస్తూ..లాల్ సింగ్ చ‌ద్దా సినిమా రిజ‌ల్ట్‌పై హ‌ర్షం వ్య‌క్తం చేసిన విజ‌య‌శాంతి

NQ Staff - August 14, 2022 / 03:00 PM IST

Vijayashanti : టాలీవుడ్ హీరోల‌కు కౌంట‌ర్ ఇస్తూ..లాల్ సింగ్ చ‌ద్దా సినిమా రిజ‌ల్ట్‌పై హ‌ర్షం వ్య‌క్తం చేసిన విజ‌య‌శాంతి

Vijayashanti : హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’కి రీమేక్‌గా బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ చేసిన చిత్రం లాల్ సింగ్ చ‌ద్దా. అద్వైత్ చందన్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీలో క‌రీనా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టించ‌గా, టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైత‌న్య కీలక పాత్రలో నటించాడు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాని సమర్పించడం.. నాగార్జున ప్ర‌మోష‌న్స్‌లో యాక్టివ్‌గా పాల్గొన‌డంతో మూవీపై అంచ‌నాలు భారీగా పెరిగిన‌, ఆ అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది ఈ చిత్రం.

రాముల‌మ్మ ఫైర్..

లాల్ సింగ్ చ‌ద్దా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దారుణంగా విఫ‌లం కావ‌డంతో బీజేపీ నాయకురాలు, నటి విజయశాంతి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. తమ జాతీయవాదుల పిలుపును అంది పుచ్చుకుని, అడుగు వేసిన దేశ భక్తులకు ధన్యవాదాలు తెలుపుతూ రాములమ్మ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దేశంపై ద్వేషం, హిందూ ధర్మం పట్ల వ్యతిరేకత, హిందువులంటే చులకన భావంతో వ్యాఖ్యలు చేస్తూ సినిమాలు తీసే ఆమిర్ ఖాన్ చిత్రం లాల్ సింగ్ చడ్డా ఇప్పుడు కూలబడి కుదేలైందని విజయశాంతి అన్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న బాలీవుడ్ సినిమా ప్రేక్షకులు ఆమిర్ నైజం తెలుసుకుని ఆయన సినిమాలంటే అసహ్యించుకుంటున్న నేపథ్యంలో ఏం జరగబోతోందో గ్రహించి.. కనీసం పెట్టుబడైనా తిరిగి తెచ్చుకోవడానికి దక్షిణాది రాష్ట్రాల మీద.. విదేశీ మార్కెట్ మీదే ఆధారపడ్డాడన్నారు. టాలీవుడ్ ప్రముఖ హీరోలు ఎంత ప్రమోట్ చేసినా లాల్ సింగ్ పప్పులు ఉడకలేదంటూ కౌంటర్ ఇచ్చారు.

Vijayashanti Countered Aamir Khan

Vijayashanti Countered Aamir Khan

”దీనంతటికీ కారణం ఒకటే.. మేకవన్నె పులిలా వ్యవహరించే ఆమిర్ అసలు తీరుపై హిందూ సంస్థలు, మాతృదేశ, బీజేపీ అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తూ.. వాస్తవాలపై అవగాహన కల్పిస్తూ వచ్చారు. ఫలితంగా ప్రజలు సత్యాన్ని తెలుసుకున్నారు. పాకిస్తాన్‌కి వంత పాడుతూ.. ఉగ్రవాదానికి నిధులిచ్చే టర్కీ దేశానికి అభిమాని అయిన ఆమిర్ ఖాన్ సినిమా టికెట్ డబ్బులను.. పేదల కోసమో, మరో మంచి ప్రయోజనానికో ఉపయోగించాలన్న మాలాంటి అసంఖ్యాక జాతీయవాదుల పిలుపును అందిపుచ్చుకుని తగిన రీతిలో స్పందించారు..” అంటూ రాములమ్మ రాసుకొచ్చారు.

తన సినిమాలు చూస్తే చూడండి, లేకుంటే లేదన్న లాల్ సింగ్ హీరోయిన్ కరీనా కపూర్ వ్యాఖ్యల్లోని అహంకారాన్ని కూడా అర్ధం చేసుకున్నారు. ప్రజల్ని అమాయకులుగా భావించి ఇష్టమొచ్చిన వ్యాఖ్యలు చేస్తే… ఫలితాలు ఇలాగే ఉంటాయని గ్రహించాలి అంటూ రాముల‌మ్మ త‌న పోస్ట్ ద్వారా క‌రీనాకి కూడా కౌంటర్ ఇచ్చింది. కాగా, సినిమా రిలీజ్‌కి ముందు కూడా విజ‌య శాంతి..ఈ సినిమాతో పాటు ఆమీర్ ఖాన్‌పై కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

 

 

 

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us