Vijayashanthi : అప్పెడెప్పుడో చేస్తే రాములమ్మ ఇప్పడిలా దొరికిపోయిందేంటబ్బా.!

NQ Staff - September 22, 2022 / 08:11 PM IST

Vijayashanthi : అప్పెడెప్పుడో చేస్తే రాములమ్మ ఇప్పడిలా దొరికిపోయిందేంటబ్బా.!

Vijayashanthi : లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నటి విజయశాంతి. ఆమె ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా ఒకింత ఆసక్తికరమైన వ్యాఖ్యలే చేస్తారనుకోండి. అయితే, అప్పుడెప్పుడో రాములమ్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారానికి కారణమయ్యాయ్.

ఇంతకీ రాములమ్మ పలికిన ఆ చిలక పలుకులేంటయ్యా.!

ఇండస్ర్టీలో అగ్రహీరోల గురించి మీరు ఏం చెప్పదలచుకున్నారు అని ఓ ఇంటర్వ్యూలో అడిగితే, అందుకు రాములమ్మ చెప్పిన సమాధానం ఏ హీరో గురించి ఏమీ చెప్పడానికి లేదు. వాళ్లు కేవలం సినిమాల్లో హీరోలంతే. బయట కాదు. వాళ్లు తీసుకున్న రెమ్యునరేషన్లలో కొంతైనా ప్రజల కోసం ఖర్చు చేసింది లేదు.

అందరూ ముసుగు దొంగలే అంటూ చిరంజీవి, బాలయ్య, వెంకటేష్.. ఇలా అగ్రహీరోలందరి మీదా కస్సుమనింది రాములమ్మ. అంతేకాదు, రాజకీయాల విషయానికీ లింకు పెట్టింది రాములమ్మ.

రాజకీయాల్లో తాను తలచుకుంటే ఎప్పుడో కేంద్ర మంత్రిని అయ్యేదాన్ననీ, కానీ, తనకు ప్రజా సేవ మీద మాత్రమే దృష్టి వుందనీ, అందుకే ఇక్కడే వుండిపోయాననీ చెప్పుకొచ్చింది విజయశాంతి.

తెలంగాణా ఉద్యమం సమయంలో కూడా మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది. సపోర్ట్ చేయండి అని అడిగితే ఏ హీరో కూడా ముందుకు రాలేదు. రాజకీయాల్లో వున్న తనకు ప్రజలు దండ వేసి అభినందిద్దాం అనుకునేలా ఒక్క హీరో కూడా కనిపించలేదనీ, వ్యాఖ్యానించారు విజయ శాంతి.

ఈ మాటలు చెప్పి చాలా చాలా కాలమే అయ్యింది విజయ శాంతి. ఆ తర్వాతే ఆమె సెకండ్ ఇన్నింగ్స్‌లో ‘సరిలేరు నీకెవ్వరు..’ సినిమాలో నటించారు. వేదికపై మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఫోటోలకు పోజిచ్చారు. ఇంకా చాలా చాలా జరిగాయ్. కానీ, అప్పటి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయ్ విచిత్రంగా.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us