Vijaya Devarakonda : విజయ్‌ దేవరకొండను తొక్కేస్తున్న బడా ప్రొడ్యూసర్‌.. ఎంత పని చేశాడంటే..?

NQ Staff - February 21, 2023 / 09:19 AM IST

Vijaya Devarakonda : విజయ్‌ దేవరకొండను తొక్కేస్తున్న బడా ప్రొడ్యూసర్‌.. ఎంత పని చేశాడంటే..?

Vijaya Devarakonda : మామూలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగాలంటే ఒక మాట మీద నిలబడాలి. ఇచ్చిన మాటను పక్కన పెడితే ఎవరికైనా కోపం వస్తుంది. దాంతో హీరో కెరీర్‌ మీద ఎఫెక్ట్‌ పడుతుంది. గతంలో ఎంతోమంది హీరోలు ఇలా నిర్మాతల విషయంలో మాట తప్పి కెరీర్‌ను నాశనం చేసుకున్నారు కూడా. ఇప్పుడు విజయ్‌ దేవరకొండ చేసిన పని కూడా ఆయన కొంప ముంచుతోంది.

విజయ్‌ దేవరకొండ ఇప్పుడు ఖుషీ సినిమాతో పాటు గౌతమ్‌ తిన్నమూరితో ఓ సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత ఆయన పరశురాం డైరెక్షన్‌ లో గీతాగోవిందం-2 సినిమా చేయాల్సి ఉంది. అయితే తన బ్యానర్‌ లో వచ్చిన గీతా గోవిందం మూవీ పెద్ద హిట్  కావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్‌ చేయాలని పరశురాంకు అడ్వాన్స్‌ కూడా ఇచ్చాడు అల్లు అరవింద్‌.

భార్యతో కలిసి..

కానీ రాత్రికి రాత్రే ప్లాన్‌ మార్చేసిన పరశురాం.. అదే గీతా గోవిదం-2 సినిమాను దిల్‌ రాజు నిర్మాణంలో చేసేందుకు అగ్రిమెంట్‌ ఓకే చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అల్లు అరవింద్ చాలా సీరియస్ అయ్యాడు. దాంతో పరశురాం తన భార్యతో కలిసి అల్లు అరవింద్ ఇంటికి వెళ్లాడు. కానీ అల్లు అరవింద్ మాత్రం కూల్‌ కాలేదు.

ఈ సమయంలోనే పరశురాం నుంచి ఓ మాట తీసుకున్నాడు. గీతాగోవిందం-2 సినిమా కంటే ముందే తాను చెప్పిన హీరోతో మూవీ చేయాలని కండీషన్ పెట్టాడు. దానికి పరశురాం ఓకే అనడంతో.. కోలీవుడ్‌ హీరో కార్తితో మూవీ తీయమని చెప్పడంతో పరశురాం కూడా ఓకే అన్నాడు. అంటే ఇప్పుడు గీతాగోవిందం-2 కంటే ముందే కార్తితో సినిమా చేయనున్నాడన్నమాట. ఒక రకంగా ఇప్పుడు ఇది విజయ్‌ దేవరకొండకు పెద్ద బొక్కే అని చెప్పుకోవాలి. పరశురాం చేసిన పని వల్ల అల్లు అరవింద్‌ విజయ్‌కు షాక్ ఇచ్చాడు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us