Varasudu : తమిళ హీరో విజయ్ – వంశీ ‘వారసుడు’ స్టోరీ లైన్ ఇదేనా.?

NQ Staff - September 6, 2022 / 11:09 PM IST

156965Varasudu : తమిళ హీరో విజయ్ – వంశీ ‘వారసుడు’ స్టోరీ లైన్ ఇదేనా.?

Varasudu : తమిళ హీరో విజయ్, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘వారసుడు’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తమిళంలో ఈ సినిమా టైటిల్ ‘వారిసు’. తొలుత ఈ సినిమాని, తెలుగు – తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నామనీ, ఇది ‘బై లింగ్వల్’ ఫిలిం అనీ, పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదలవుతుందనీ నిర్మాత దిల్ రాజు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Vijay Vamshi paidipally Varasudu Story

Vijay Vamshi paidipally Varasudu Story

అయితే, తెలుగు సినీ పరిశ్రమలో షూటింగుల బంద్ నేపథ్యంలో ‘వారిసు’ సినిమాని తమిళ సినిమాగా అభివర్ణిస్తూ, ఆ సినిమా షూటింగ్‌కి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారు దిల్ రాజు.

స్టోరీ లీక్ అయ్యిందహో..

‘వారసుడు’ సినిమా స్టోరీ గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ ప్రచారంలోకి వచ్చింది. ఇది నలుగురు అన్నదమ్ముల కథ అట. విజయ్ ప్రధాన పాత్రలో కనిపిస్తుండగా, మరో ముగ్గురు అన్నదమ్ములుగా ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, శ్రీకాంత్ నటిస్తున్నారట.

తెలుగులో వెంకటేష్ హీరోగా వచ్చిన ‘సంక్రాంతి’ సినిమా తరహాలో వుంటుందట ఈ ‘వారసుడు’. ఫ్యామిలీ సెంటిమెంటుతోపాటు, హై ఓల్టేజ్ యాక్షన్ కూడా ఈ సినిమాలో వుండబోతోందని సమాచారం. కన్నడ కస్తూరి రష్మిక మండన్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.