Vijay Devarakonda : ముంబైలో విజయ్ దేవరకొండ: యాడ్ షూట్‌తోపాటుగా అది కూడా.!

NQ Staff - November 24, 2022 / 06:17 PM IST

Vijay Devarakonda : ముంబైలో విజయ్ దేవరకొండ: యాడ్ షూట్‌తోపాటుగా అది కూడా.!

Vijay Devarakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాతో చాలా పెద్ద షాక్ తినేశాడు. ఆ సినిమా ఇచ్చిన షాకింగ్ రిజల్ట్ కారణంగానే ‘జనగనమన’ అనే సినిమాని పక్కన పడేయాల్సి వచ్చింది. మహేష్‌బాబుతో పూరి జగన్నాథ్ చేయాలనుకున్న సినిమా అది. ‘లైగర్’ సినిమాకి క్రియేట్ అయిన హైప్ నేపథ్యంలో పూరి – విజయ్ సంయుక్తంగా ‘జనగనమన’ ప్రాజెక్టుని ప్రకటించేశారు.. బొక్క బోర్లా పడ్డారు.

ఇదిలా వుంటే, ప్రస్తుతం ముంబైలో వున్నాడు విజయ్ దేవరకొండ. అదీ ఓ యాడ్ షూట్ కోసం ముంబైకి వెళ్ళాడట ఈ రౌడీ హీరో. అంతేనా, ఓ బాలీవుడ్ ఫిలిం మేకర్‌తోనూ విజయ్ దేవరకొండ సమావేశమయ్యాడట.

రష్మికని కలిశాడా.? లేదా.?

రష్మిక, విజయ్.. ఇద్దరూ ప్రేమపక్షులన్న ప్రచారం బి-టౌన్‌లో చాలాకాలంగా జరుగుతోంది. సౌత్ సినీ వర్గాల్లోనూ ఈ విషయమై చాలా గాసిప్స్ తరచూ వినిపిస్తుంటాయి.

ముంబై టూర్ అంటే విజయ్ – రష్మిక కలుసుకునే వుండాలి. కానీ, బాలీవుడ్ మీడియా కెమెరాలకు ఈ జంట చిక్కలేదు. ఇంతకీ, ముంబైలో విజయ్ దేవరకొండ కలిసిన ఆ ఫిలిం మేకర్ ఎవరబ్బా.? ఇదైతే ప్రస్తుతం ఓ మిలియన్ డాలర్ క్వశ్చన్‌గా మారింది.

ప్రస్తుతం విజయ్ తన తాజా చిత్రం ‘ఖుషీ’ సెట్స్ మీదకు మళ్ళీ ఎప్పుడు వెళుతుందా.? అని ఎదురుచూస్తున్నాడు. సమంత ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె అనారోగ్యం బారిన పడ్డంతోనే ‘ఖుషీ’ సినిమా షూటింగ్ ఆగింది.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us