Unstoppable with NBK : అర్జున్ రెడ్డికి వెల్‌క‌మ్ చెప్పిన స‌మ‌ర‌సింహా రెడ్డి.. ర‌చ్చ మాములుగా లేదుగా…!

Unstoppable with NBK : నంద‌మూరి బాల‌కృష్ణ ఆహా కోసం హోస్ట్ అవ‌తారం ఎత్తి ఎంత ర‌చ్చ చేస్తున్నాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. టాలీవుడ్ స్టార్స్ అంద‌రిని ఇంట‌ర్వ్యూలు చేస్తూ ఆ ఇంట‌ర్వ్యూల‌లో ఆస‌క్తికర విష‌యాలు రాబ‌డుతున్నాడు. ఈ ప్రోగ్రాంకి భారీ రెస్పాన్స్ వస్తుంది. అభిమానులే కాక ప్రేక్షకులంతా బాలయ్యని ఈ షో హోస్టింగ్ అదరగొట్టేస్తున్నారు అంటూ పొగిడేస్తున్నారు.

Vijay Devarakonda Puri Jagannadh Charmee Unstoppable with NBK Ep 9 Promo 1
Vijay Devarakonda Puri Jagannadh Charmee Unstoppable with NBK Ep 9 Promo 1

ఇప్పటికే ఈ షోలో మోహన్ బాబు, మంచు లక్ష్మి, మంచు విష్ణు, నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, పుష్ప టీం, అఖండ టీం, రవితేజ, గోపీచంద్ మలినేని, రానా వచ్చి అలరించారు. త్వరలో మహేష్ బాబు కూడా రానున్నారు. ఈ షో సెలబ్రిటీలతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. తాజాగా ఈ షో అరుదైన రికార్డు సృష్టించింది. సినిమాలకు, షోలకు రేటింగ్ ఇచ్చే ఐఎండిబి వెబ్ సైట్ లో ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాప్ 10 షోలలో స్థానం సంపాదించింది.

అన్‌స్టాపబుల్ షోలో ఇటీవల రానాను తనదైన పంథాలో ఒక ఆట ఆదుకున్న బాలయ్య నెక్స్ట్ ఎపిసోడ్ లో లైగర్ టీమ్ తో సందడి చేయనున్నాడు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారగా.. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమో ను మేకర్స్ రిలీజ్ చేశారు. సంక్రాంతి రోజున స్ట్రీమింగ్ కానుండడంతో బాలయ్య పంచకట్టులో కనిపించారు.

పైసా వసూల్ చిత్రంతో పూరికి, బాలయ్యకు మధ్య ఉన్న కనెక్షన్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. ఆ అబిమానాన్నే బాలయ్య మరోసారి పూరి జగన్నాథ్ ని ముద్దుగా జగ్గు అని పిలిచి చూపించారు. ఇక తేడా సింగ్ పాత్ర గురించి బాలయ్య గుర్తుచేసుకున్నారు. అంతలో అల్లరి పిడుగు ఛార్మిపై బాలయ్య కౌంటర్లు విసిరారు. అప్పుడు అల్లరి.. ఇప్పుడు పిడుగు అంటూ నవ్వించేశారు.

ఇక సింహం లాంటి జగన్ , పులి లాంటి ఛార్మి నుంచి వచ్చాడు మన లైగర్ అనగానే రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఎంటర్ అయ్యాడు. విజయ్ తో బాక్సింగ్ స్టైల్లో పంచులు ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. సమరసింహారెడ్డి వెల్ కమ్స్ అర్జున్ రెడ్డి అంటూ చమత్కరించారు. ఆ తర్వాత విజయ్ కి రౌడీ పేరు ఎందుకు వచ్చిందంటూ అడిగి నిజాలు బయటపెట్టించారు. చివరగా టీమ్ తో బాక్సింగ్ గేమ్ ఆడినట్లు చూపించారు. మొత్తానికి ప్రోమో ఆద్యంతం ఆకట్టుకొంటుంది.

సంక్రాంతి కానుకగా జనవరి 14 న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్ సంక్రాంతి రోజు ప్రేక్ష‌కుల‌కి క‌నువిందుగా ఉంటుంద‌న‌డంలో అతిశయోక్తి లేదు.