Vijay Devarakonda : భవదీయుడు భగత్ సింగ్‌ రౌడీ స్టార్‌ చేయబోతున్నాడా?

NQ Staff - September 5, 2022 / 08:58 PM IST

156798Vijay Devarakonda : భవదీయుడు భగత్ సింగ్‌ రౌడీ స్టార్‌ చేయబోతున్నాడా?

Vijay Devarakonda : పవన్ కళ్యాణ్ రెండు సంవత్సరాల క్రితం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని ఉద్దేశంతో పలు సినిమాలకు కమిట్ అయిన విషయం తెలిసిందే. అందులో హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమా ఒకటి.

Vijay Devarakonda may be do Pawan Bhavadeeyudu Bhagath Singh

Vijay Devarakonda may be do Pawan Bhavadeeyudu Bhagath Singh

ఆ సినిమా అదిగో ఇదిగో ప్రారంభం అవుతుంది అంటూ వాయిదాల మీద వాయిదాలు వేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. దాంతో భవదీయుడు భగత్ సింగ్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ డేట్ లు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

ఇప్పటికే రెండు సంవత్సరాలకు పైగా వెయిట్ చేసిన దర్శకుడు హరిష్‌ శంకర్ అదే కథతో మరో హీరోతో సినిమాని చేసేందుకు సిద్ధమవుతున్నాడు అంటూ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ మరో హీరో ఎవరో కాదు విజయ్ దేవరకొండ.

ఈ రౌడీ స్టార్ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా పూర్తయిన వెంటనే పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో జనగణమన చేయాల్సి ఉంది. కానీ జనగణమన సినిమా బడ్జెట్ ఇష్యూ కారణంగా క్యాన్సిల్ అయింది అంటూ సమాచారం అందుతుంది.

ఆ సినిమా క్యాన్సల్ అవ్వడం వల్ల దర్శకుడు హరిష్‌ శంకర్ కి వెంటనే విజయ్ దేవరకొండ డేట్లు ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియదు కానీ ఒకవేళ భవదీయుడు భగత్ సింగ్ సినిమాని విజయ్ దేవరకొండ చేస్తే పవన్ కళ్యాణ్ అభిమానుల నుండి ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.