Vijay Devarakonda : నా కౌంటింగ్ రూ.200 కోట్ల నుండి మొదలు కానుంది అంటున్న లైగర్.. అంత కాన్ఫిడెంట్ ఎందుకో!
NQ Staff - August 19, 2022 / 06:42 PM IST

Vijay Devarakonda : యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కెరీర్‌లో భిన్నమైన చిత్రాలు చేసి ప్రేక్షకులని అలరించిన విషయం తెలిసిందే. ఆయన నటిస్తున్న తాజా చిత్రం లైగర్. ఆగస్ట్ 25న ఈ చిత్రం విడుదల కానుంది. చివరిగా వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంతో ప్రేక్షకులని పలకరించగా, దాదాపు రెండేళ్ల తర్వాత లైగర్ చిత్రంతో అలరించబోతున్నాడు. ఈ సినిమాపై అందరిలో ఆసక్తి పెరిగింది.
అంత కాన్ఫిడెంట్ ఏంటి?
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని ముంబై బ్యాక్ డ్రాప్‌లో పూరీ జగన్నాథ్ తెరకెక్కించారు. ఈ సినిమా బిజినెస్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఆ మధ్య ఓటీటీ, శాటిలైట్, థియేట్రికల్ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ చిత్ర బృందంతో సంప్రదింపులు జరుపిందని.. ఏకంగా 200 కోట్ల భారీ మొత్తంతో అన్ని హక్కులు కొనుగోలు చేసేందుకు ఆ సంస్థ రెడీగా ఉందనే న్యూస్ వైరల్ అయింది.

Vijay Devarakonda High Confidence On Liger Movie
ఈ వార్తలపై నేరుగా రియాక్ట్ అయ్యారు హీరో విజయ్ దేవరకొండ. ”లైగర్ కోసం 200 కోట్లు చాలా తక్కువని, థియేటర్స్‌లో అంతకంటే ఎక్కువ రాబడతాం” అని పేర్కొంటూ ట్వీట్ పెట్టారు. అంటే ఈ మూవీపై రౌడీ స్టార్ ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. తాజాగా విజయ్ దేవరకొండ తన కౌంటింగ్ రెండు కోట్ల నుండి స్టార్ట్ అవుతుందని చెప్పుకు రాగా, ఈయన కామెంట్స్‌పై అంతటా చర్చ నడుస్తుంది.
సినిమాపై అంత భారీ అంచనాలు పెట్టుకోవడానికి కారణం ఏంటా అని అందరు ఆలోచనలో పడ్డారు. పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.