Vijay Devarakonda : నా మ‌ద్ద‌తు చిరుకే.. వ్యూస్ కాదు, న్యూస్ ఇవ్వాలంటూ విజ‌య్ ట్వీట్

Vijay Devarakonda : సినీ ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల గురించి చ‌ర్చించ‌డానికి చిరంజీవి ఇటీవ‌ల ఏపీ సీఎం జ‌గ‌న్‌ని క‌లిసిన విష‌యం తెలిసిందే. సుమారు గంట 20 నిమిషాల పాటు సీఎం జగన్, చిరంజీవి భేటీ జరిగింది. సమావేశం అనంతరం మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ మంచి వాతావ‌ర‌ణంలో స‌మావేశం జ‌రిగిందని, సీఎం జ‌గ‌న్‌తో స‌మావేశం సంతృప్తిని క‌లిగించిందని అన్నారు. సామాన్య ప్ర‌జ‌ల‌కు వినోదం అందుబాటులో ఉండాల‌న్న ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని అభినందిస్తున్నానన్న ఆయన సీఎం ప్ర‌య‌త్నానికి అభినంద‌న‌లు అని పేర్కొన్నారు.

Vijay Devarakonda about Chiranjeevi rumors
Vijay Devarakonda about Chiranjeevi rumors

ఓవైపు ఇండ‌స్ట్రీ త‌ర‌ఫున చిరు సంప్ర‌దింపుల‌పై కొంద‌రు హ‌ర్షం వ్య‌క్తం చేస్తూంటే మ‌రోవైపు వైసీపీ నుంచి నుంచి చిరుకు రాజ్య‌స‌భ సీటు ఆఫ‌ర్ చేసినట్లు వార్త‌లు వ‌చ్చాయి. దీంతో ఈ విష‌యాన్ని చిరు దృష్టికి తీసుకెళ్ల‌గా..ఆ వార్త‌ల్లో ఏ మాత్రం నిజం లేద‌ని ఖండించిన విష‌యం తెలిసిందే. ఈ విష‌య‌మై ట్విట్ట‌ర్ వేదిక‌గా చిరు సుధీర్ఘంగా ఓ పోస్టు చేశారు.

`రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేను మళ్ళీ రాజకీయాలలోకి, చట్టసభలకు రావటం జరగదు. దయచేసి ఊహాగానాలని వార్తలుగా ప్రసారం చేయవద్దు. ఈ వార్తలకి, చర్చలకు ఇప్పటితో పుల్ స్టాప్ పెట్టమని కోరుతున్నా` అని పేర్కొన్నారు చిరంజీవి. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వత చిరంజీవి యాడ్‌ చేసిన యాష్‌ ట్యాగ్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. `న్యూస్‌ ఇవ్వండి, వ్యూస్‌ కాదు` అంటూ ట్యాగ్‌ చేశారు. దీంతో ఇది దుమారం రేపుతుంది.

చిరంజీవి కామెంట్స్ కి స్పందించారు రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ. చిరంజీవికి సపోర్ట్ చేస్తూ ట్వీట్‌ చేశారు. `న్యూస్‌ ఇవ్వండి, వ్యూస్‌ కాదు` అంటూ యాష్‌ ట్యాగ్‌ చేశారు విజయ్‌. దీంతో ఇప్పుడిది వైరల్‌ అవుతుంది. గతంలోనూ విజయ్‌ దేవరకొండ పలు రూమర్స్ ఎదుర్కొన్నారు. ట్రోల్స్ కి గురయ్యారు.

కరోనా సాయం సమయంలో ఆయనపై అనేక రూమార్లు వైరల్‌ అయ్యాయి. దీంతో ఆ సమయంలోనే ఘాటు కామెంట్‌ చేసిన విజయ్‌ ఇప్పుడు మరోసారి ఈ రూపంలో పంచుకున్నారు. మొత్తంగా చిరంజీవి కామెంట్‌కి, విజయ్‌ ట్వీట్‌ ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతున్నాయి.