Nayanthara : రిసెప్షన్ క్యాన్సిల్ చేసుకున్న నయనతార దంపతులు.. శభాష్ అంటున్న నెటిజన్స్
NQ Staff - June 19, 2022 / 09:19 AM IST

Nayanthara : దాదాపు ఏడేళ్లపాటు ప్రేమలో మునిగి తేలిన నయనతార- విఘ్నేష్ శివన్ దంపతులు ఎట్టకేలకు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇన్నాళ్లు బ్యాచిలర్‌గా ఉన్న నయనతార ఓ ఇంటిది కావడంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే నయనతార పెళ్ళికి స్టార్స్ కొద్దిమందిని తప్పించి ఇండస్ట్రీ నుంచి పెద్దగా ఎవరినీ పిలవలేదు.

vignesh shivan Nayanthara wedding reception
అసలు విషయం ఇది..
చెన్నైలో భారీ స్థాయిలో రిసెప్షన్ ఏర్పాటు చేసి దానికి అందరిని ఆహ్వానిస్తారనే టాక్ ఒకటి నడిచింది. అయితే పెళ్ళై పదిరోజులు అవుతున్నాకూడా దీనిపై నోరు మెదపడం లేదు. అయితే ఇప్పుడేమో రిసెప్షన్ క్యాన్సిల్ అంటూ సమాచారం అందుతోంది. దీనికి ఓ రీజన్ ఉంది అని సోషల్ మీడియాతో పాటు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. రిసెప్షన్ కోసం ఖర్చు పెట్టాలి అనుకున్న మొత్తాన్ని తమిళనాడులోని అన్ని అనాధ ఆశ్రమాలకు పంచాలని నయన్ మరియు విఘ్నేష్ లు భావించారట.
దీంతో ఒక రోజు పూర్తిగా అన్ని అనాధ ఆశ్రమాలకు ఆహారం పెట్టేంత మొత్తాన్ని నయన్ మరియు విఘ్నేష్ శివన్ లు ఇచ్చారని సమాచారం. అనుకున్నట్టుగా రిసెప్షన్ జరిగితే.. కొద్దిమంది మాత్రమే గుర్తుంచునే వారు. కాని ఇప్పుడు నయన్ మరియు విఘ్నేష్ చేసిన మంచి పనిని అందరూ అభినందిస్తున్నారు. మీపై ఉన్న గౌరవం మరింత పెరిగింది అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
పెళ్లి తరువాత వెంటనే తిరుపతి వెళ్లిన నయన్ దంపతులు ఇప్పుడు కేరళలోని నయన్ స్వస్థలం కు కూడా వెళ్లి తన తల్లి వద్ద ఆశీస్సులు తీసుకొని, అక్కడ ఉన్న అనేక పుణ్యక్షేత్రాలు, ప్రముఖ ప్రదేశాలు సందర్శిస్తున్నారని సమాచారం. ఇక అన్ని ప్రాంతాలు తిరిగిన తరువాత వీరిద్దరు హనీమూన్ ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. కొన్ని రోజులు ఇద్దరు ఏకాంతంగా విదేశాలకు వెళ్తారట.