Vignesh Shivan And Nayana Tara : ప్రేమ‌గా త‌న భ‌ర్త‌ను హ‌గ్ చేసుకున్న న‌య‌న‌తార‌.. చ‌క్క‌ర్లు కొడుతున్న‌ఫొటో

NQ Staff - July 4, 2022 / 11:56 AM IST

Vignesh Shivan And Nayana Tara : ప్రేమ‌గా త‌న భ‌ర్త‌ను హ‌గ్ చేసుకున్న న‌య‌న‌తార‌.. చ‌క్క‌ర్లు కొడుతున్న‌ఫొటో

Vignesh Shivan And Nayana Tara : దాదాపు ఏడేళ్ల పాటు రిలేష‌న్‌లో ఉన్న విఘ్నేష్ శివ‌న్– న‌య‌న తార రీసెంట్‌గా పెళ్లి పీట‌లెక్కిన విష‌యం తెలిసిందే. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేశాయి. పెళ్లి త‌ర్వాత ఈ జంట‌ థాయ్‌లాండ్ హ‌నీమూన్ ట్రిప్‌ను ఫుల్ ఎంజాయ్ చేశారు. ట్రిప్ అనంత‌రం ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ప్రొఫెష‌న‌ల్ కమిట్ మెంట్స్ తో బిజీ అయిపోయింది న‌య‌నతార‌.

క్యూట్ పిక్..

Vignesh Shivan Nayana Tara Latest Cute Photos

Vignesh Shivan Nayana Tara Latest Cute Photos

త‌మ హ‌నీమూన్ ట్రిప్‌లోని మ‌ధుర‌మైన క్ష‌ణాల‌ను గుర్తు చేసుకుంటూ విఘ్నేశ్ శివ‌న్ ఓ త్రో బ్యాక్ స్టిల్‌ను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసుకున్నాడు.ఈ స్టిల్ లో ఇద్దరు తారలు న‌య‌న్‌-విఘ్నేశ్ ఒక‌రినొక‌రు ఆప్యాయంగా హ‌గ్ చేసుకున్న స్టిల్‌ను షేర్ చేస్తూ..దీన్ని నా బ‌ర్త్ డేగా చేసుకోండి..అని క్యాప్ష‌న్ ఇచ్చాడు.

Vignesh Shivan Nayana Tara Latest Cute Photos

Vignesh Shivan Nayana Tara Latest Cute Photos

ఇద్దరు ఒకరినొకరు మైమరిపోయి హగ్ చేసుకున్న స్టిల్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇక సినిమాల విష‌యానికొస్తే..న‌య‌న‌తార ప్ర‌స్తుతం బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్‌ జంటగా.. సౌత్ స్టార్ డైరెక్ట‌ర్ ఆట్లీ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న జ‌వాన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈసినిమాలో షారుక్ డ్యూయల్ రోల్ చేస్తుండగా.. అందులో న‌య‌న్ తార వ‌న్ ఆఫ్ ది హీరోయిన్‌గా న‌టిస్తోంది. మ‌రో ఫీమేల్ లీడ్ రోల్‌లో దీపికా ప‌దుకొనే క‌నిపించ‌నున్న‌ట్టు బీటౌన్ స‌ర్కిల్ టాక్‌ గట్టిగా నడుస్తోంది.

ఇక విఘ్నేష్ శివన్ విషయానికి వస్తే… ఈ ఇయర్ లో కాతువాల‌కు రెండు కాధ‌ల్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రించాడు విఘ్నేశ్ శివ‌న్‌. ఈ సినిమా సక్సెన్ ను ఎంజాయ్ చేశాడు. ఇక నెక్ట్స్ స్టార్ హీరో అజిత్ తో ఏకే 62 మూవీని చేయ‌బోతున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌పై త్వ‌ర‌లో క్లారిటీ రానుంది.

Vignesh Shivan Nayana Tara Latest Cute Photos

Vignesh Shivan Nayana Tara Latest Cute Photos

జూన్ 9 గురువారం రోజు ఉదయం చెన్నై సమీపంలోని మహాబలిపురం షెరటాన్‌ గ్రాండ్‌ హోటల్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు నయనతార- విగ్నేష్ శివన్. ఇన్నేళ్ల ప్రేమ బంధానికి మూడు ముళ్ళతో ముడి పెట్టి వైవాహిక జీవితంలోకి ఎంటర్ అయ్యారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us