Yash : పిల్ల‌ల్ని భ‌య‌పెట్టించిన య‌ష్‌.. క్రేజీ కామెంట్స్ చేస్తున్న నెటిజ‌న్స్

NQ Staff - May 12, 2022 / 11:21 AM IST

Yash : పిల్ల‌ల్ని భ‌య‌పెట్టించిన య‌ష్‌.. క్రేజీ కామెంట్స్ చేస్తున్న నెటిజ‌న్స్

Yash : క‌న్న‌డ స్టార్ హీరో య‌ష్ ప్ర‌స్తుతం కుటుంబంతో స‌ర‌దాగా గ‌డుపుతున్నాడు. కేజీఎఫ్‌2 కోసం చాలా శ్ర‌మించ‌గా, ఈ సినిమా మంచి హిట్ కావ‌డంతో ప్ర‌స్తుతం త‌న స‌మ‌యాన్ని పిల్ల‌ల‌కే కేటాయించాడు. కొడుకు డైనోసార్ అన‌గానే..ఐర‌న్ డాడ్ భ‌య‌ప‌డ్డాడు అని య‌శ్ అంటున్నాడు. ఇపుడు డాడీ పులి అవుతున్నాడ‌ని య‌శ్ పులిలా గాండ్రించగా..ఈ సూప‌ర్ స్టార్ డాడ్ కొడుకు భ‌య‌ప‌డి లోప‌లికి పారిపోయాడు. య‌శ్ త‌న పిల్ల‌ల‌తో ఫ‌న్ టైం స్పెండ్ చేసిన వీడియో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.

ఎ వైల్డ్‌ స్టార్ట్‌ టు అవర్‌ వెడ్‌నస్‌డే అన్న క్యాప్షన్‌తో యశ్‌ ఈ వీడియోను ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. అందులో తన పిల్లలు ఆయ్రా, యథర్వ్‌లతో యశ్‌ ఆడుకోవడం చూడొచ్చు. కేజీఎఫ్‌లో రాకీభాయ్‌గా తనలోని మాస్‌ యాంగిల్‌ను చూపించిన యశ్‌ ఇప్పుడిలా పిల్లలతో ఆడుకుంటున్న క్యూట్‌ వీడియో వైరల్‌గా మారింది.

Video Of Yash Spending Fun with His Kids

Video Of Yash Spending Fun with His Kids

క‌న్నడ హీరో యశ్ – డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన కేజీఎఫ్‌: చాప్టర్ 2” చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం.. భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డులు సృష్టించింది.

భారతీయ సినిమా చరిత్రలో ప్రతిష్టాత్మక 1000 కోట్ల క్లబ్ లో చేరిన నాలుగో సినిమాగా ‘కేజీఎఫ్ 2’ నిలిచింది. ‘దంగల్’ – ‘బాహుబలి 2’ – RRR సినిమాలు ఈ మాన్స్టెరస్ బ్లాక్ బస్టర్ కంటే ముందు వరుసలో ఉన్నాయి. కన్నడ పరిశ్రమలో లో వెయ్యి కోట్లు దాటిన ఫస్ట్ మూవీ ‘కేజీఎఫ్ 2’. లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంత వసూళ్ళను రాబడుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

కేజీఎఫ్ 2 ఏప్రిల్ 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. 25 రోజుల్లో ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.1100 కోట్ల వ‌సూళ్ల‌ను రాబట్టింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా అత్య‌ధిక గ్రాస్ సాధించిన మూడో భారతీయ సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది కేజీఎఫ్ చాఫ్ట‌ర్ 2.

 

 

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us