Jr NTR : మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేస్తున్న యంగ్ టైగ‌ర్.. రానున్న రోజుల‌లో సంద‌డే సంద‌డి..!

NQ Staff - June 19, 2022 / 02:26 PM IST

Jr NTR : మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేస్తున్న యంగ్ టైగ‌ర్.. రానున్న రోజుల‌లో సంద‌డే సంద‌డి..!

Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల‌పై అభిమానుల‌లో ఎంత ఆస‌క్తి ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దాదాపు మూడున్నరేళ్ల పాటు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంత తెరకెక్కించిన మాగ్నమ్ ఓపస్ ఆర్ఆర్ఆర్ కోసం కేటాయించారు ఎన్టీఆర్. ఈ సినిమా పూర్తయి రిలీజ్ అయ్యేంత వరకు ఏ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రమయత్నం చేయలేదు. కేవలం ఈ ప్రాజెక్ట్ కోసమే డెడికేటెడ్ గా వర్క్ చేశాడు.

స‌స్పెన్స్..స‌స్పెన్స్

దాదాపు మూడేళ్లుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు మార్చిలో ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైంది. బ్లాక్ బస్టర్ హిట్ గా మంచి టాక్ ని సొంతం చేసుకోవడమే కాకుండా భారీ స్థాయిలో వసూళ్లని రాబట్టింది. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత తారక్ ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌లపై ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే తన కెరీర్‌లోని 30, 31వ చిత్రాలను వరుసగా అనౌన్స్ చేశాడు ఈ హీరో.

దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తారక్ 30వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో తారక్ పాత్ర మునుపెన్నడూ చూడని విధంగా తీర్చిదిద్దేందుకు కొరటాల రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా తరువాత తారక్ తన నెక్ట్స్ చిత్రాన్ని కేజీయఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు.

Vetrimaaran to Direct Jr NTR

Vetrimaaran to Direct Jr NTR

ఈ సినిమాను ప్రశాంత్ నీల్ మరోసారి తనదైన మార్క్ మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాల తరువాత కూడా తారక్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ఓకే చేసే పనిలో ఉన్నాడట. ఇప్పటికే తమిళ దర్శకుడు వెట్రిమారన్ చెప్పిన ఓ స్టోరీలైన్ బాగా నచ్చడంతో, ఈ సినిమా కథను పూర్తిగా డెవలప్ చేయాల్సిందిగా తారక్ గతంలోనే చెప్పాడట. దీంతో వెట్రిమారన్ ఇప్పుడు ఆ కథను పూర్తిగా రెడీ చేసి తారక్‌కు వినిపించేందుకు సిద్ధమయ్యాడట.

అయితే వెట్రిమారన్‌పై పూర్తి నమ్మకంతో తారక్ ఆయనకు ఓకే చెప్పడం ఖాయమని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సబ్జెక్ట్ ఓరియెంటెడ్ సినిమాలు తీయడంలో వెట్రిమారన్ స్పెషలిస్ట్. అందుకే, ఆయన తెరకెక్కించే సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరి నిజంగానే వెట్రిమారన్ కథకు తారక్ ఓకే చెబుతాడా..అదే జ‌రిగితే మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంద‌నేది స‌స్పెన్స్.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us