Venu Swamy : ప‌వ‌న్ క‌ళ్యాణ్, శ్రీజలు నాలుగు పెళ్లిళ్లు చేసుకోనున్నారంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేసిన వేణు స్వామి

NQ Staff - July 19, 2022 / 11:08 AM IST

Venu Swamy : ప‌వ‌న్ క‌ళ్యాణ్, శ్రీజలు నాలుగు పెళ్లిళ్లు చేసుకోనున్నారంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేసిన వేణు స్వామి

Venu Swamy : ప్ర‌ముఖ జ్యోతిష్య పండితుడు వేణు స్వామి తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, శ్రీజ పెళ్లి విష‌యంలో సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్ప‌టికే మూడు పెళ్లిళ్లు చేసుకోగా, శ్రీజ రెండు పెళ్లిళ్లు చేసుకుంది. అయితే ఈ ఇద్ద‌రి జాత‌కం ప్ర‌కారం నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటార‌ని వేణు స్వామి తాజా ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నాడు.

Venu Swamy Reveals Sreeja And Pawan Kalyan Marriages

Venu Swamy Reveals Sreeja And Pawan Kalyan Marriages

నాలుగో పెళ్లి..

గ‌త కొద్ది రోజులుగా శ్రీజ విడాకుల విష‌యం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మొద‌టి భ‌ర్తకు విడాకులు ఇచ్చిన శ్రీజ కొద్ది రోజులుగా రెండో భ‌ర్త‌కు కూడా దూరంగా ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. కొన్నాళ్ల మ‌ధ్య శ్రీజ సోషల్ మీడియాలో తన భర్తను అన్ ఫాలో చేసింది. ఇక అప్పటి నుంచి ఆమె వ్యవహారంపై రకరకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా ఆమె త్వరలోనే మూడో పెళ్లి కూడా చేసుకుంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్ర‌మంలో శ్రీజ పెళ్లి వ్యవహారంపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి స్పందించారు. శ్రీజ మూడో పెళ్లి చేసుకుంటుందని.. అంతటితో ఆగకుండా ఆమెకు నాలుగు పెళ్లిళ్లు జరుగుతాయని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కామెంట్స్ చేశారు. ఆమె జాతకంలో నాలుగు పెళ్లిళ్లు ఉన్నాయనన్నారు.

Venu Swamy Reveals Sreeja And Pawan Kalyan Marriages

Venu Swamy Reveals Sreeja And Pawan Kalyan Marriages

శ్రీజ త‌న ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకుంటుంది. రెండు మూడు నెల‌లో ఆమె పెళ్లి జ‌రుగుతుంది. ఇక పవన్ కూడా నాలుగో పెళ్లి చేసుకుంటారని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి అన్నారు. జాతకం ప్ర‌కారం వారిద్ద‌రికి నాలుగు పెళ్లిళ్లు అవుతాయని రాసి ఉందన్నారు వేణు స్వామి

పవన్ కళ్యాన్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె ముందుగా వైజాగ్‌కు చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెతో విడిపోయి,.. హీరోయిన్ రేణుదేశాయ్‌తో పాటు కొన్నాళ్లు సహజీవనం చేశారు. ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకున్నారు.రేణూకి కూడా విడాకులు ఇచ్చి అన్నాని వివాహం చేసుకున్నారు.

ఇప్పుడు ఆయన జాతకంగా నాలుగో పెళ్లి కూడా ఉందని… ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి అన్నారు. సెలబ్రిటీలు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా… ఎలా ఉన్న అది వాళ్ల వ్యక్తిగతమన్నారు. దానిపై మనం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమన్నారు వేణు స్వామి.

 

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us