F3 Press Meet : హీరోలు స్టేజ్‌పై స్టెప్పులు వేయడం కామన్‌గా మారిందా.. ఎఫ్3 సక్సెస్ మీట్‌లో వెంకీ, వరుణ్ దుమ్మురేపారుగా..!
NQ Staff - June 5, 2022 / 01:25 PM IST

F3 Press Meet : ఒకప్పుడు మన హీరోలు ఈవెంట్స్‌కి అలా వచ్చి ఇలా వెళ్లేవారు. సినిమా గురించి మాట్లాడడమే తప్ప స్టేజ్‌పై ఎగరడాలు వంటివి చేసే వారు కాదు. కాని ఇప్పుడు పరిస్థితుల కారణంగా స్టార్ హీరోలు సైతం ఈవెంట్స్‌లో స్టేజ్‌పై స్టెప్పులు వేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మహేష్ బాబు సర్కారు వారి పాట సెలబ్రేషన్స్‌లో భాగాంగా సీరియస్‌గా స్టేజ్‌పైకి వెళ్లి డ్యాన్స్ చేశారు.
ఇక ఇప్పుడు ఎఫ్ 3 సక్సెస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా వెంకటేష్, వరుణ్ తేజ్ చిందేశారు.అనీల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్,తమన్నా, మెహరీన్, సోనాల్‌చౌహాన్ కథానాయికలుగా నటించిన చిత్రం ఎఫ్ 3 మే 27న విడుదలై పెద్ద విజయం సాధించింది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం వైజాగ్‌లో `ఎఫ్3 త్రిబుల్ బ్లాక్‌బస్టర్` పేరుతో సక్సెస్ మీట్‌ని ఏర్పాటు చేశారు.
ఇందులో వెంకటేష్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైజాగ్‌ని చూస్తుంటే ఒకప్పుడు తనసినిమాలకు సంబంధించిన షూటింగ్ రోజులు గుర్తుకొస్తున్నాయని తెలిపారు. `కళియుగ పాండవులు`, `స్వర్ణకమలం`, `గోపాల గోపాల`, `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` చిత్రాలు చేశానని తెలిపారు. ఇక `మల్లీశ్వరి` సినిమా కోసమైతే ఏకంగా కత్రినా కైఫ్ తో అలా నడుస్తూ బీచ్‌లో తిరిగినట్టు తెలిపారు. `గురు` సినిమాలోని జింగిడి సాంగ్ ఇక్కడే చేశానని, వైజాగ్‌తో అనేక మెమరీలున్నాయని చెప్పారు.
అదే సమయంలో సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడం సంతోషంగా ఉందని, అనిల్ రావిపూడికి,దిల్‌రాజుకి థ్యాంక్స్ చెప్పారు వెంకటేష్. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇవ్వాలని కష్టపడ్డామని తెలిపారు. మరోవైపు ఇంత పెద్ద హిట్ కి కారణమైన ఆడియెన్స్ కి థ్యాంక్స్ చెబుతూ, మహిళా ఆడియెన్స్ ని ప్రత్యేకంగా మెన్షన్ చేయడం విశేషం. `దృశ్యం2`, `నారప్ప` చిత్రాలతో తన ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారని, అందుకే `ఎఫ్3`లో నారప్ప గెటప్ పెట్టామని తెలిపారు.

Venkatesh Varun Tej and Anil Ravipudi Dance at F3 Press Meet
తనదైన డైలాగ్‌లో ఊపు తీసుకొచ్చారు వెంకీ. అనంతరం `కుర్రాడు బాబోయ్.. `అనే పాటకి డాన్సులు వేశారు. అనిల్ రావిపూడి, వెంకీ, వరుణ్ తేజ్ కలిసి స్టేజ్‌పైనే అదిరిపోయే మాస్ స్టెప్పులేసి ఈవెంట్‌కి కళ తీసుకొచ్చారు. ఇప్పుడిది వైరల్ అవుతుంది.మరోవైపు ఇందులో అనిల్ రావిపూడి మాట్లాడుతూ, ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియెన్స్ థ్యాంక్స్ చెబుతూ, త్వరలో `ఎఫ్ 4` సినిమాతో వస్తున్నామని తెలిపారు.
మరోవైపు నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ, తొమ్మిది రోజుల్లో వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసిందనందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. మరోవైపు రాజేంద్రప్రసాద్.. దిల్‌రాజ్‌కి మూవీ మోఘల్ అంటూ బిరుదు ఇవ్వడం విశేషం. రామానాయుడుని అలా పిలిచే వారిమని, ఇప్పుడు దిల్‌రాజుని అలా పిలుస్తున్నామని, అలాంటి సినిమాలు చేస్తూ వచ్చారని కొనియాడారు రాజేంద్రప్రసాద్.