F3 Movie Pre Release Event : అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్ ఎఫ్3. ఈ మూవీలో వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, సునీల్, సోనాల్ చౌహాన్‌తో పాటు రాజేంద్రప్రసాద్,ప్రగతి వంటి కీలక నటులు కూడా నటించారు. ఈ చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రనిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సినిమాపై ఆసక్తి కలిగించేందుకు జోరుగా ప్రమోషన్స్ చేస్తుంది.
శిల్పకళావేదిక ప్రాంగణంలో ఎఫ్ 3 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ కార్యక్రమంలో విక్టరీ వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సినిమాలు ఎప్పుడో మూడేళ్ల క్రితం థియేటర్లలో వచ్చాయని అన్నారు. దృశ్యం, నారప్ప సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయని.. దీంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారని అన్నారు. అయితే ఈసారి అభిమానులను నిరాశ పరచనని అన్నారు. మళ్లీ ఇప్పుడు ఎఫ్3 మూవీతో థియేటర్లలోకి వస్తున్నట్లు చెప్పారు వెంకటేష్.
ఎఫ్3 అందరి కోసం తీసిందని.. ప్రతి ఒక్కరికి నచ్చుతుందన్నారు. అనిల్ రావిపూడి మంచి స్క్రిప్ట్‌తో పనిచేశారని అభినందించారు. ‘సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మే 27న ఎఫ్3 మూవీని ప్రతి ఒక్కరు చూడాలి..’ అని కోరారు.వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ‘ఎఫ్3 అని అనుకుంటూ రెండు సమ్మర్లు అయిపోయాయి. ఫైనల్‌గా మీ ముందుగా వస్తున్నాం. ఇలాంటి ఫ్యామిలీ సినిమా వచ్చి చాలా కాలం అయింది.

ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఈ సినిమాలో పాత సునీల్ అన్నను మళ్లీ చూస్తారు. నేను సునీల్ అన్న మామ-అల్లుడిగా నటించాం. మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు.. అని చెప్పారు. ‘మా కోబ్రా వెంకటేష్ గారితో రెండుసార్లు పనిచేసే అదృష్టం నాకే వచ్చింది. అది మళ్లీ మళ్లీ రిపీట్ అవ్వాలని కోరుకుంటున్నా. మే 27న సినిమా చూసేయండి. ఎఫ్3 సక్సెస్ మీట్‌లో అందరం మాట్లాడుకుందాం..’ అని ఆయన అన్నారు.
- Advertisement -
ఎఫ్2 తర్వాత కరోనా కారణంగా బ్రేక్ వచ్చింది. ఎఫ్2 చిత్రం మాకు వాస్తవానికి పెద్ద శత్రువు. ఎందుకంటే దాన్ని మించి ఉంటేనే ఎఫ్3ని ఆదరిస్తారని తెలుసు. కామెడీ క్రియేట్ చేయడం చాలా కష్టం. నవ్వడం చాలా సులభం కానీ, నవ్వించడం చాలా కష్టం. ఈ సినిమా నిర్మాణంలో నాకెంతో సహకరించిన నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ లకు కృతజ్ఞతలు. ఎఫ్2లో నటించిన వాళ్లలో 80 శాతం మంది దీంట్లో కూడా నటించారు.

ఈ సినిమాలో 35 మంది నటులు ఉన్నారు. వారందరిని పేరుపేరునా ఎందుకు చెబుతున్నానంటే థియేటర్లలో వాళ్లు కనిపిస్తే చప్పట్లు కొడతారు. హీరోలు వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, ప్రగతి, అన్నపూర్ణమ్మ, వై విజయ, రాజేంద్రప్రసాద్, సునీల్, అలీ… ఇలా ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమా కోసం తన సోల్ పెట్టి మరీ పనిచేశాడు. వరుణ్ తేజ్ నాకు ఓ బ్రదర్ లాంటివాడు. వరుణ్ ను ఎఫ్2లో ఒకలా చూస్తారు, ఎఫ్3లో మరోలా చూస్తారు. వరుణ్ లో ఇంత కామెడీ టైమింగ్ ఉందా అని అందరూ ఆశ్చర్యపోతారు.
వెంకటేశ్ గారి గురించి చెప్పాలంటే ఐ లవ్యూ సర్ అని చెబుతాను. సెట్స్ పై ఎంతోమంది నటులు ఉన్నప్పుడు వాళ్లు అందించే ప్రోత్సాహం ఎనలేనిది. కామెడీ చేసేటప్పుడు ఇమేజ్ ను కూడా పట్టించుకోకుండా చేసే నటుడు వెంకటేశ్. ఎఫ్2 కంటే పదింతలు ఈ చిత్రంలో వెంకటేశ్ నవ్విస్తారు. సరిగ్గా చెప్పాలంటే… నవ్వడం ఒక యోగం… నవ్వలేకపోవడం ఒక రోగం… నవ్వించడం ఒక భోగం. కరోనా కారణంగా ఈ రెండేళ్లలో ఎంతో ఒత్తిడికి గురయ్యాం. ఇప్పుడవన్నీ వదిలేసి ఎఫ్3 రిలీజయ్యే థియేటర్లకి వెళ్లి హాయిగా నవ్వుకోండి అని అనీల్ రావిపూడి అన్నారు.