Veera Simha Reddy : ‘వీర సింహా రెడ్డి’ చెత్త.! బాలయ్య అభిమానికి కట్టలు తెంచుకున్న ఆగ్రహం.!
NQ Staff - January 12, 2023 / 10:07 AM IST

Veera Simha Reddy : బాలయ్య అభిమానులంటే.. అచ్చం బాలయ్యలానే వుంటారా.? సాక్ష్యం కావాలా.? ఇదిగో, ఈ అభిమానిని చూస్తే ఆ విషయం అర్థమవుతుంది.!
నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ‘వీర సింహా రెడ్డి’ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. థియేటర్లో మీడియాతో ఓ అభిమాని మాట్లాడుతూ, సినిమా సూపర్ హిట్.. అంటూ నినదించాడు. ఇంతలోనే, ఇంకో వ్యక్తి అక్కడికి వచ్చి, ‘సినిమా చెత్త.. అస్సలు బాగాలేదు’ అంటూ వ్యాఖ్యానించాడు.
తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమై..
అంతే.. బాలయ్య అభిమానికి కోపమొచ్చింది. చేతికి రుమాలు గట్టిగా బిగించి కట్టాడు.. నీ సంగతి చూస్తా.. అంటూ, ‘వీర సింహా రెడ్డి’ని విమర్శించిన ప్రేక్షకుడి వెంట, థియేటర్లోకి వెళ్ళాడు. లోపల ఏం జరిగి వుంటుంది.? బాలయ్య అభిమాని, ఆ ప్రేక్షకుడ్ని కొట్టి వుంటాడా.?
ఏమోగానీ, ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘బాలయ్య అభిమానులతో పెట్టుకుంటే దబిడి దిబిడే.. ఎవడోగానీ ఆ హేటర్.. వాడికి బతుకు బస్టాండ్ అయిపోయి వుంటుంది..’ అంటూ నెటిజనం కామెంట్లేస్తున్నారు.