Varun Tej : ఆ రియల్ హీరో పాత్రలో రీల్ హీరో వరుణ్ తేజ్.!
NQ Staff - November 15, 2022 / 07:42 PM IST

Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కి ఈ మధ్య పెద్దగా కలిసి రావడం లేదు. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘గని’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా కోసం బాడీ బిల్డింగ్ చేసి చాలా చాలా కష్టపడ్డాడు వరుణ్ తేజ్.
కానీ, ఫలితం దక్కలేదు. ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్టులున్నాయ్. అందులో ఒకటి జాతీయ అవార్డు విన్నర్ ప్రవీణ్ సత్తారు సినిమా కాగా, మరో ప్రాజెక్ట్ కోసం కొత్త డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్‌ని ఎంగేజ్ చేశాడు వరుణ్ తేజ్.
సాహసం చేయరా ఢింభకా.!
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని రీసెంట్గా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ లో సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేయనున్నారు. కాగా, ఈ సినిమాలో వరుణ్‌కి జోడీగా బాలీవుడ్ భామ మానుషి చిల్లర్ నటిస్తోందని తెలుస్తోంది.
అధికారిక ప్రకటన రాలేదు కానీ, దాదాపు ఈ ముద్దుగుమ్మ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. వరుణ్ నటిస్తున్న తొలి ప్యాన్ ఇండియా మూవీ ఇది. పవర్ ఫుల్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాత్రలో వరుణ్ నటిస్తున్నాడు ఈ సినిమాలో.
ఎయిర్ ఫోర్స్ అధికారి వర్ధమాన్ అభినందన్ పాత్రకు సంబంధించిన రియాల్టీ అంశాలు ఈ సినిమాలో ఎంతో సాహసోపేతంగా చూపించ బోతున్నారనీ తెలుస్తోంది. ప్రస్తుతం లండన్‌లో ప్రవీణ్ సత్తారు సినిమ షూటింగ్లో బిజీగా వున్నాడు వరుణ్ తేజ్.