Mega Vs Allu : మెగా డౌట్? వారిద్దరి మధ్య భారీ గ్యాప్?

NQ Staff - October 17, 2023 / 04:39 PM IST

Mega Vs Allu : మెగా డౌట్? వారిద్దరి మధ్య భారీ గ్యాప్?

Mega Vs Allu  :

మెగా కాంపౌండ్ లో ఫంక్షన్ అంటేనే ఓ రేంజ్ లో ఉంటుంది. తెలుగు మీడియాతో జాతీయ మీడియా కూడా వీరి ఫంక్షన్లను కవర్ చేయడానికి తహతహలాడుతుంటుంది. మెగా ఇంట జరిగే ఏ సెలబ్రేషన్ కు అయినా జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. దానికి తగ్గట్టే మీడియా కూడా కవరేజ్ ఇస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలను మెగా కుటుంబం గ్రాండ్ గా చేయాలని భావిస్తోంది. ఈ సందర్భంగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సందర్భంగా బయటకొచ్చే ఒక్కో ఫొటో, వీడియోలను జనాలు అమితాసక్తితో గమనిస్తుంటారు. అయితే ప్రీ వేడుకల్లో ఫొటోలను చూసిన ఫ్యాన్స్ ను ఓ విషయం తీవ్రంగా వేధిస్తున్నది.

ఈమధ్యనే చిరంజీవి తన ఇంట్లో పెద్ద పార్టీ ఇచ్చారు. కాబోయో భార్యాభర్తలు వరుణ్, లావణ్యలను ఆహ్వానించి, మెగా మెంబర్లతో భారీ గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. కొణిదల అన్నదమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు.., అల్లు వారి కుటుంబం అంతా హాజరయ్యారు. అయితే పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ హాజరుకాలేదు.

Varun Tej Lavanya Tripathi Pre Wedding Party Photos

Varun Tej Lavanya Tripathi Pre Wedding Party Photos

పవన్ ఓ వైపు రాజకీయాలతో, మరో వైపు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. కాబట్టి రాలేదు అనుకోవచ్చు. కానీ పార్టీకి వచ్చే అవకాశం ఉన్నా అల్లు అర్జున్ రాలేదు. ఆయన కారణాలు ఆయనకు ఉండవచ్చు కానీ.. అసలు కారణం ఏంటని సినీ సర్కిల్ లో గుసగుసలు బయలుదేరాయి.

సీన్ కట్ చేస్తే.. ఈసారి స్వయంగా బన్నీ దంపతులు కాబోయే కొత్త జంటకు, మెగా కుటుంబానికి పార్టీ అరెంజ్ చేశారు. మెగా మెంబర్లతో పాటు నితిన్, రితూవర్మ లాంటి క్లోజ్ ఫ్రెండ్స్ అంతా హాజరయ్యారు. కానీ ఈ వేడుకల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించలేదు. దీంతో మెగాభిమానులతో పాటు సగటు సినీ జీవులకు కూడా అనేక అనుమానాలు వస్తున్నాయి.

Varun Tej Lavanya Tripathi Pre Wedding Party Photos

Varun Tej Lavanya Tripathi Pre Wedding Party Photos

రామ్ చరణ్, బన్నీకి మధ్య పెద్దగా పొసగడం లేదని చాలా రోజులుగా టాక్ నడుస్తోంది. త్రిపుల్ ఆర్ కు ఆస్కార్ వచ్చినప్పుడు బన్నీ చేసిన ట్వీట్.. బన్నీకి నేషనల్ అవార్డ్ వచ్చినప్పుడు చెర్రీ చేసిన ట్వీట్ ను చూస్తుంటే..ఇద్దరి మధ్య ఏదో గ్యాప్ ఉందనే విషయం తెలుస్తోందని సినీ విశ్లేషకులు చెపుతున్నారు.

వాస్తవానికి గతంలో వీరిద్దరి మధ్య ఎంతో అనుబంధం ఉండేది..కానీ ఈమధ్య వీరి కలిసి ఉన్న ఫొటోలు కూడా కరువయ్యాయనే చెప్పవచ్చు. ఇప్పుడు మెగా ఫంక్షన్లలోనూ వీరు కలువకపోవడంతో వీరి దోస్తీ..కటీఫ్ అయ్యిందా అనే డౌట్లు బలపడుతున్నాయి. త్రిపుల్ ఆర్ తో రామ్ చరణ్ పాన్ వరల్డ్ స్టార్ డం పొందడం, పుష్ప తో పాన్ ఇండియాలో బన్నీ మాస్ స్టార్ ఇమేజ్ తో అందరినీ ఆకట్టుకోవడం.. మెగా ఫ్యామిలీకి సంతోషాన్ని నింపింది. ఇలా ఇద్దరు తమ సత్తాను చాటినా.. ఇంతకుముందు ఉన్నట్టుగా ఎందుకు ఉండడం లేదని ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. తాజాగా వైరల్ అవుతున్నా ఫొటోలు మరిన్ని వదంతులకు ఊతంగా మారాయి. అయితే వీరిమధ్య ఎలాంటి గ్యాప్ రాలేదని, ఏవైనా వస్తే సర్దుకుంటాయని కొందరు ఫ్యాన్స్ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us