Varun Tej And Lavanya Tripathi : వరుణ్-లావణ్య ఎంగేజ్ టైమ్, ప్లేస్ ఫిక్స్.. ఎవరెవరు వస్తున్నారంటే..?
NQ Staff - June 8, 2023 / 01:49 PM IST

Varun Tej And Lavanya Tripathi : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ ను తాజాగా మెగా ఫ్యామిలీ కన్ఫర్మ్ చేసింది. వీరిద్దరి పెండ్లి వార్తలు చాలా కాలంగా వస్తున్నాయి. వరుణ్, లావణ్య ప్రేమలో ఉన్నారంటూ ఎన్నో రూమర్లు వచ్చాయి. కానీ వాటిపై ఎన్నడూ ఎవరూ స్పందించలేదు. ఇక లావణ్య అయితే వాటిని కొట్టి పారేసింది.
కానీ చివరకు అదే నిజం అయింది. వీరిద్దరి ఎంగేజ్ మెంట్ రేపు అంటే జూన్ 9న జరగబోతోంది. కాకపోతే ఈ ఎంగేజ్ మెంట్ చాలా సింపుల్ గా చేస్తున్నట్టు తెలుస్తోంది. అది కూడా నాగబాబు ఇంట్లోనే చేస్తున్నారు. అతిథులు ఎవరూ రావట్లేదని సమాచారం. ఉదయం 9గంటలకు వీరిద్దరి ఎంగేజ్ మెంట్ ను జరపనున్నారు.

Varun Tej And Lavanya Tripathi Engagement Will Place At Naga Babu House
కేవలం మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ మాత్రమే ఈ వేడుకకు రాబోతోంది. ఇంకెవ్వరికీ ఆహ్వానం అందలేదంట. మీడియాకు, టాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా ఆహ్వానం ఇవ్వలేదని తెలుస్తోంది. ఇరు కుటంబాల నడుమ సింపుల్ గా జరపబోతున్నారని తెలుస్తోంది. ఎంగేజ్ మెంట్ సింపుల్ గా జరుపుకుని పెండ్లి గ్రాండ్ గా చేయబోతున్నారంట.
ఇప్పటికే ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. వరుణ్ తేజ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. లావణ్య కూడా వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. వీరిద్దరూ మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో నటించారు. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డట్టు సమాచారం.