Prabhas Birthday Special : రీరిలీజ్‌ ట్రెండ్ లోకి యంగ్ రెబల్ స్టార్ ఎంట్రీ, బాక్సాఫీస్‌ కి ఇక కలెక్షన్ల ‘వర్షం’

NQ Staff - October 2, 2022 / 04:01 PM IST

Prabhas Birthday Special : రీరిలీజ్‌ ట్రెండ్ లోకి యంగ్ రెబల్ స్టార్ ఎంట్రీ, బాక్సాఫీస్‌ కి ఇక కలెక్షన్ల ‘వర్షం’

Prabhas Birthday Special : టాలీవుడ్‌ లో ప్రజెంట్ రీ రిలీజులకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫస్ట్‌ టైమ్‌ రిలీజులకి ఏ మాత్రం తీసిపోకుండా ఫ్యాన్స్‌ సందడితో పాటు బాక్సాఫీస్‌ లెక్కల్లో కూడా పోటీపడుతున్నారు స్టార్స్‌. అభిమానులయితే డైలాగ్ టు డైలాగ్ డబ్బింగులు, స్క్రీన్‌ దగ్గర స్టెప్పులు, థియేటర్లో అరుపులతో అసలైన హడావిడికి డెఫినిషన్ చెప్తున్నారు. ఇప్పుడా ట్రెండ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ రెబల్ స్టార్.

ప్రభాస్ బర్త్‌ డే స్పెషల్ గా అక్టోబర్‌ 23 న వర్షం మూవీ రీ రిలీజ్‌ కానుంది. శోభన్ డైరెక్ట్‌ చేసిన ఈ మూవీ 2004 లో రిలీజై బాక్సాఫీస్‌ సెన్సేషన్ గా నిలిచింది. ప్రభాస్ ని మాస్‌ హీరోగా నిలబెట్టి కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం వర్షం. ఇక దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకెంత హైలైట్ గా నిలిచిందో తెలిసిందే. ఆల్బమ్‌ లోని అన్ని పాటలూ ఎవర్ గ్రీన్. రికార్డు స్థాయిలో హైయెస్ట్ స్క్రీన్స్‌ లో విడుదల చేయాలన్న ప్లాన్‌ లో ఉన్నారు డిస్ట్రిబ్యూటర్స్‌. ఈ రీ రిలీజ్‌ ను కృష్ణం రాజుకి అంకితమస్తున్నట్టు ప్రకటించారు కూడా.

ఓవైపు ఆది పురుష్ అప్‌డేట్స్‌,

టీజర్‌ రిలీజ్‌ తో రెబల్ స్టార్‌ అభిమానులు ఫుల్‌ జోష్‌ లో ఉన్నారు. ఇదే నెలలో లో బర్త్‌ డే రోజే వర్షం రీ రిలీజ్‌ కానుండడంతో డబుల్ సంబరంలో ఉన్నారు ప్రభాస్ డై హార్డ్‌ ఫ్యాన్స్‌. బాహుబలి తర్వాత ప్యాన్ ఇండియా స్టార్‌ గా ప్రభాస్ రేంజ్‌ అండ్ క్రేజ్ పదింతలు పెరిగింది. భాషతో సంబంధం లేకుండా ప్రభాస్ ని అభిమానించేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్‌ పై వింటేజ్‌ లుక్‌ లో తమ హీరోని చూసుకోవాలని ఫ్యాన్స్‌ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. మొత్తానికిప్పుడు వర్షంతో ఆ కోరిక తీరిపోనుంది.

మహేష్ బాబు బర్త్‌ డే స్పెషల్ గా ఒక్కడు, పోకిరి రీ రిలీజులతో ఈ ట్రెండ్ టాలీవుడ్‌ లో స్టార్టయినా, తర్వాత పవన్‌ కళ్యాణ్ తమ్ముడు, జల్సాతో ఇంకాస్తా ఊపందుకుంది. లేటెస్ట్ గా బాలక్రిష్ణ కూడా ఇరవై సంవత్సరాల క్రితం విడుదలై పెద్దగా ఆడని చెన్నకేశవరెడ్డి చిత్రం ద్వారా రీ రిలీజులోనే రికార్డులు క్రియేట్‌ చేశాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ వసూళ్ల వరద పారించాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ వంతొచ్చింది.

అదీ 18 సంవత్సరాల క్రితం విడుదలై ఇండస్ట్రీ రికార్డులు సాధించిన సినిమా. అలాంటి బంపర్ హిట్ మూవీ రీ రిలీజంటే ఫ్యాన్స్‌ కే కాదు కామన్‌ ఆడియెన్స్‌ కి కూడా ఎగ్జయిట్మెంటే. అప్పుడు థియేటర్లో చూడనివాళ్లు ఇప్పుడయినా కచ్చితంగా చూడాలనీ, చూసినవాళ్లు ఆ నోస్టాల్జియాను మళ్లీ ఫీలవ్వాలని, అప్పటి రోజుల్ని రీకాల్ చేసుకోవాలని చూస్తారు.

మరి ఈ లెక్కన ప్రభాస్ వర్షం మూవీ బాక్సాఫీస్‌ దగ్గర కాసుల వర్షం కురిపించి రీ రిలీజుల్లో ఎలాంటి సరికొత్త రికార్డు క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us