Varnika : ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలోని చిన్న పాప ఇప్పుడెలా వుందో తెలిస్తే షాకవ్వాల్సిందే.!
NQ Staff - August 15, 2022 / 06:35 PM IST

Varnika : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ‘సన్నాప్ సత్యమూర్తి’ సినిమా సూపర్ హిట్ సినిమా. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ మేనకోడలి పాత్రలో కనిపించిన చిన్నారి గుర్తుంది కదా.
స్వీటీ పాత్రలో కనిపించిన ఈ ముద్దులొలికే చిన్నారి అసలు పేరు బేబీ వర్ణిక. ఇప్పుడు క్యూట్ బేబీ కాదు. బేబమ్మ. అదేనండీ, హీరోయిన్ వయసుకు వచ్చేసింది. చిన్నప్పటి ఛబ్బీనెస్, క్యూట్ నెస్ ఏమాత్రం తగ్గలేదు. అంతకు మించి అనే రేంజ్‌లో పెరిగాయ్ వర్ణికలో.
నెట్టింట ట్రెండింగ్ అవుతున్న వర్ణిక..

Varnika Latest Cute Photos
సోషల్ మీడియాలో ఇప్పుడీ అమ్మడు తెగ ట్రెండింగ్ అయిపోయింది. వర్ణిక ఫోటోలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇంతకీ ఎవరీ వర్ణిక.? అని ఆరా తీయగా అసలు విషయం బోధపడింది.
‘సన్నాఫ్ సత్యమూర్తి’ పాప అని తెలిసింది. ఈ సినిమా తర్వాత వర్ణిక, ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్‌కి చిన్నప్పటి రోల్ పోషించింది. ఆ తర్వాత సినిమాల్లో ఎక్కడా కనిపించలేదు.
స్టడీస్‌పై ఫోకస్ పెట్టి, మళ్లీ ఇప్పుడే సినిమాలపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటో సెషన్లతో పిచ్చెక్కించేస్తోంది వర్ణిక. వర్ణిక తాజా ఫోటోలు చూస్తుంటే, టాలీవుడ్‌కి ఓ ఫ్రెష్ హీరోయిన్ దొరికేసినట్లే.. అని నెటిజనం ఫిక్సయిపోతున్నారు. చూడాలి మరి, నాటి ఈ క్యూట్ బేబీ, నేడు హీరోయిన్‌గా కుర్రోళ్ల మనసు దోచుకుంటుందేమో.!